ETV Bharat / sports

కేఎల్​ రాహుల్​కు వైస్​ కెప్టెనే కాదు.. మరో బిగ్​ షాక్​ కూడా.. - ఆస్ట్రేలియా సిరీస్​ కేఎల్ రాహుల్​ వైస్ కెప్టెన్సీ

ఆస్ట్రేలియా టెస్టు సిరీస్​లో భాగంగా మిగిలిన రెండు టెస్టులకు.. కేఎల్​ రాహుల్​ను వైస్​ కెప్టెన్​ బాధ్యతలను నుంచి తప్పించిన బీసీసీఐ మరో షాక్​ కూడా ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆ వివరాలు..

kl rahul
కేఎల్​ రాహుల్​కు వైస్​ కెప్టెనే కాదు.. మరో బిగ్​ షాక్​ కూడా..
author img

By

Published : Feb 20, 2023, 9:13 PM IST

బోర్డర్‌ గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరగనున్న మిగిలిన రెండు టెస్టులకు బీసీసీఐ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కేఎల్‌ రాహుల్‌కు ఉన్న వైస్‌ కెప్టెన్‌ ట్యాగ్​ను తొలిగించి క్రికెట్​ ప్రేమికులకు షాక్ ఇచ్చింది. అలానే ఆసీస్​తో వన్డే సిరీస్‌కు కూడా జట్టును ప్రకటించిన బోర్డు.. వైస్‌ కెప్టెన్‌గా రాహుల్‌ స్థానంలో హార్దిక్‌ పాండ్యాను సెలెక్ట్ చేసింది. అయితే తొలి రెండు టెస్టుల్లో మంచి ప్రదర్శన చేయడంలో విఫలమైన కేఎల్​ రాహుల్​ను.. మూడో టెస్టుకు పక్కనపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అతడికి బదులుగా తుది జట్టులో అద్భుతమైన ఫామ్​లో ఉన్న శుభమన్​ గిల్​కు అవకాశం ఇవ్వాలని టీమ్​ మేనేజ్​మెంట్​ భావిస్తోందట. ఈ విషయాన్ని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు.

"బోర్డుతో పాటు టీమ్​ మేనెజ్‌మెంట్‌ ఎప్పుడూ రాహుల్‌కు మద్దతుగానే ఉంటుంది. కానీ ప్రస్తుతం జట్టులో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారింది. రాహుల్ గతంలో విదేశీ టెస్టుల్లో బాగా ఆడినప్పటికీ.. ప్రస్తుతం ఫామ్‌ కోల్పోయి పరుగులు చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. అయితే ప్రస్తుతం అతడికి యంగ్ ప్లేయర్స్​ నుంచి తీవ్ర పోటీ నెలకొంది. అయితే తొలి రెండు టెస్టుల్లో టీమ్​ఇండియా విజయం సాధించిన నేపథ్యంలో అతడిని మిగిలిన రెండు టెస్టులకు కూడా సెలక్టర్లు ఎంపిక చేశారు. లేదంటే జట్టులో మార్పులు చాడాల్సి వచ్చేది. అయితే ఇండోర్​లో జరగబోయే టెస్టుకు శుభమన్​ జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది" అని ఓ బీసీసీఐ సీనియర్‌ అధికారి తెలిపారు.

కాగా, టెస్టుల్లో గత ఏడాది నుంచి రాహుల్​ పేలవ ప్రదర్శన చేస్తూనే వస్తున్నాడు. గత పది ఇన్నింగ్స్​లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. కనీసం 30 పరుగుల మార్క్​ను కూడా చేయలేకపోయాడు. ఈ పది ఇన్నింగ్స్​లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 23 పరుగులే. మొత్తంగా పది ఇన్నింగ్స్​లలో 13.57 సగటుతో 123 పరుగులే చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టులు కలిపి 38 పరుగులు మాత్రమే చేశాడు.

ఇదీ చూడండి: కేెఎల్​ రాహుల్​కు హెచ్చరిక.. ఇకనైనా సరిచేసుకుంటాడా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.