Ben Stokes World Cup 2023 : వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తిరిగి 50ఓవర్ల ఫార్మాట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న ( Ben Stokes ODI Return ) అతడు.. మళ్లీ ఇంగ్లాండ్ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. ముందుగా అతడు న్యూజిలాండ్‌తో జరిగే నాలుగు వన్డేల సిరీస్‌లో ఆడనున్నాడు. ఈ మేరకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు బుధవారం ప్రకటించిన జట్టులో స్టోక్స్‌కు స్థానం లభించింది. దీన్ని బట్టి చూస్తే అతడు భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ ఆడటం ఖాయంగానే కనిపిస్తోంది.
Ben Stokes ODI Retirement Back : బెన్ స్టోక్స్ గతేడాది వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. నిలకడగా మూడు ఫార్మాట్లు ఆడటం కష్టమని పేర్కొంటూ వన్డేలకు దూరమయ్యాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్టు జట్టుకు సారథిగా ఉన్నాడు. గతేడాది ఇంగ్లాండ్ టీ20 వరల్డ్ కప్ గెలవడంలో స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. 2019లో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లోనూ స్టోక్స్.. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్ తొలి వన్డే వరల్డ్ కప్ గెలవడానికి కృషి చేశాడు. ఈ నేపథ్యంలోనే వచ్చే ప్రపంచకప్‌కు అతడిని తిరిగి తీసుకొచ్చేందుకు ఈసీబీ పెద్దలు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. అక్టోబర్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో అతడి సేవలు ఇంగ్లాండ్‌కు కీలకంగా మారుతాయని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
-
The big man is back 🔥
— England Cricket (@englandcricket) August 16, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Luke Wright on the sensational return of Ben Stokes to ODI cricket... 👇
">The big man is back 🔥
— England Cricket (@englandcricket) August 16, 2023
Luke Wright on the sensational return of Ben Stokes to ODI cricket... 👇The big man is back 🔥
— England Cricket (@englandcricket) August 16, 2023
Luke Wright on the sensational return of Ben Stokes to ODI cricket... 👇
"బెన్ స్టోక్స్ నాయకత్వ పటిమ, మ్యాచ్‌లను గెలిపించే సత్తా.. ఇంగ్లాండ్ జట్టుకు ఉపయోగపడుతుంది. బెన్ స్టోక్స్ ఆటను ప్రతి ఫ్యాన్ ఎంజాయ్ చేస్తారు. ఇంగ్లాండ్ వన్డే జట్టులో అతడిని చూడటం చాలా మందికి సంతోషం కలిగిస్తుంది."
-ల్యూక్ రైట్, ఇంగ్లాండ్ జాతీయ సెలెక్టర్
భారత్‌లో జరిగే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్.. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. గత ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై అనూహ్య విజయం సాధించి ఇంగ్లాండ్ తొలిసారి వన్డే ప్రపంచకప్ గెలిచింది. సూపర్ ఓవర్లోనూ మ్యాచ్ టై కావడం వల్ల.. బౌండరీ కౌంట్ (ఎక్కువ బౌండరీలు కొట్టిన జట్టు) ద్వారా ఇంగ్లాండ్‌ను విజేతగా నిర్ణయించారు. అయితే, ఫైనల్లో స్టోక్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టెస్టుల్లో దూకుడైన ఆటతీరుతో ఇంగ్లాండ్‌ను నడిపిస్తున్నాడు. దీంతో ఈసారి స్టోక్స్ సేవలు కీలకంగా మారతాయని ఇంగ్లాండ్ భావిస్తోంది.
World Cup Trophy Tour : తాజ్‌మహల్ ముందు ప్రపంచకప్ ట్రోఫీ.. ఫ్యాన్స్ సందడే సందడి
Rishabh Pant Batting : పంత్ మైదానంలోకి అడుగుపెట్టేశాడోచ్.. బ్యాటింగ్ వీడియో వైరల్