ETV Bharat / sports

సాహా ట్వీట్​పై బీసీసీఐ దర్యాప్తు!

ఓ జర్నలిస్టు తనపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడని టీమ్‌ఇండియా సీనియర్‌ వికెట్ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా చేసిన ఆరోపణలపై బీసీసీఐ స్పందించినట్లు తెలుస్తోంది. దీనిపై బోర్డు సమగ్ర దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, పలువురు మాజీలు కూడా సాహా వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచారు.

Bcci
సాహా
author img

By

Published : Feb 21, 2022, 12:35 PM IST

Updated : Feb 21, 2022, 1:27 PM IST

ఇంటర్వ్యూ కోసం ఓ జర్నలిస్తు అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడని టీమ్‌ఇండియా సీనియర్‌ వికెట్ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా చేసిన ట్వీట్​ సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంపై బీసీసీఐ సమగ్ర దర్యాప్తు చేయనుందని తెలుస్తోంది. అలాగే శ్రీలంక టెస్టు సిరీస్ జట్టులో ఎంపిక కాకపోవడంపై సాహా చేసిన వ్యాఖ్యలను కూడా పరిగణలోకి తీసుకోనున్నట్లు సమాచారం.

"సాహా ఇంటర్వ్యూలో ఏమన్నాడు. వాట్సాప్ చాట్​లో ఏముంది. అది ఎవరు పంపారు? అనే విషయాలను పూర్తి స్థాయిలో బీసీసీఐ దర్యాప్తు చేయనుంది. సాహా వాట్సాప్​లో చేసిన వ్యాఖ్యలు ఓ జర్నలిస్టువే అని రుజువైతే ఇండియన్ క్రికెటర్లను ఇంటర్వ్యూ చేయకుండా అతన్ని రద్దు చేసే అవకాశం ఉంది." అని బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు.

జర్నలిస్టుపై సాహా అసహనం..

ఓ జర్నలిస్టుపై సాహా అసహనం వ్యక్తం చేశాడు. ఆ జర్నలిస్టు ఇంటర్వ్యూ కోసం తనను బలవంతం చేసినట్లు పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వాట్సాప్‌ మెసేజీల స్క్రీన్‌షాట్‌ను పోస్ట్​ చేశాడు. అయితే, తాను స్పందించకపోయేసరికి ఆ వ్యక్తి తీవ్ర వ్యాఖ్యలు చేశాడని సాహా పేర్కొన్నాడు. 'భారత క్రికెట్‌ జట్టుకు నేను చేసిన సేవలకు గాను ఒక జర్నలిస్టు నుంచి ఎదురైన అనుభవం ఇది. జర్నలిజం ఇంత దిగజారిపోయింది' అని సాహా విచారం వ్యక్తం చేశాడు.

మాజీల మద్దతు..

సాహా పోస్ట్​ చేసిన ట్వీట్​కు పలువురు మాజీలు మద్దతు పలికారు. వీరిలో వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్​ సింగ్, ఆకాశ్​చోప్రా రవిశాస్త్రి ఉన్నారు. "ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం విచారకరం. కేవలం చెంచాగిరి చేసేవాడు మాత్రమే ఎవరితోనూ గౌరవించబడడు. అసలు పాత్రికేయుడే కాదు. నీతోనే ఉంటాం వృద్ధిమాన్‌" అని సెహ్వాగ్​ ట్వీట్ చేశాడు. ఈ వ్యవహారంపై భారత జట్టు ప్లేయర్లకు అండగా నిలవాలని బీసీసీఐను కోరాడు టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ హర్భజన్​ సింగ్. 'ఓ ఆటగాడిని జర్నలిస్టు బెదిరించడం షాకింగ్​. ఏ ఆటగాడికి ఇలా జరగకూడదు. బీసీసీఐ రంగంలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైంది.' అని రవిశాస్త్రి అన్నాడు.

ద్రవిడ్​పై సాహా వ్యాఖ్యలు

వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్​కు సాహాను టీమ్​ఇండియా దూరం పెట్టింది. ఇందులో సీనియర్‌ క్రికెటర్లు అజింక్య రహానె, ఛెతేశ్వర్‌ పుజారా, ఇషాంత్‌ శర్మతో పాటు సాహాను కూడా వదిలేశారు. ఈ నేపథ్యంలోనే జట్టు యాజమాన్యంపై ఓ ఇంటర్వూలో తీవ్ర ఆరోపణలు చేశాడు సాహా. రిటైర్మెంట్​కు ప్లాన్ చేసుకోవాలని కోచ్ ద్రవిడ్ సూచించాడని ఆరోపించాడు.

  • After all of my contributions to Indian cricket..this is what I face from a so called “Respected” journalist! This is where the journalism has gone. pic.twitter.com/woVyq1sOZX

    — Wriddhiman Saha (@Wriddhipops) February 19, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి: Harbhajan Singh: 'సాహాలా ఎవరికీ జరగకుండా చూడండి'

Last Updated : Feb 21, 2022, 1:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.