స్వలింగ వివాహంతో ఒక్కటైన ఆసీస్ మహిళా క్రికెటర్ మేగాన్ స్కట్- జెస్ హోలియోక్ జంటకు పండంటి ఆడబిడ్డ జన్మించింది. ఎమర్జెన్సీ సీ- సెక్షన్ పద్ధతిలో ఆగస్టు 17న చిన్నారి పుట్టినట్లు స్కట్ ట్విట్టర్లో వెల్లడించింది. రిలీ లూయిస్ స్కట్ అనే పాపకు పేరు పెట్టినట్లు చెప్పింది. ఆ పాప 858 గ్రాముల బరువు ఉన్నట్లు పేర్కొంది. ఆ చిన్నారితో తీసుకున్న పలు ఫొటోలను షేర్ చేసింది.
"ఎమర్జెన్సీ సీ- సెక్షన్ ద్వారా మాకు పాప పుట్టింది. దీంతో 28 వారాల మా నిరీక్షణకు తెరపడింది. నా జీవితంలో ఈ ఇద్దరు అందమైన అమ్మాయిలు ఉండడం నా అదృష్టం" అని మేగాన్ ట్విట్టర్లో పేర్కొంది.
-
~ Rylee Louise Schutt 💕
— Megan Schutt (@megan_schutt) August 21, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
~ 17/08/21 at 10:09pm
~ 28 Weeks 6 Days
~ 858gm pic.twitter.com/TfieNUNtDv
">~ Rylee Louise Schutt 💕
— Megan Schutt (@megan_schutt) August 21, 2021
~ 17/08/21 at 10:09pm
~ 28 Weeks 6 Days
~ 858gm pic.twitter.com/TfieNUNtDv~ Rylee Louise Schutt 💕
— Megan Schutt (@megan_schutt) August 21, 2021
~ 17/08/21 at 10:09pm
~ 28 Weeks 6 Days
~ 858gm pic.twitter.com/TfieNUNtDv
ఆస్ట్రేలియాలో కొన్నేళ్ల క్రితం స్వలింగ వివాహాలు చట్టబద్దం చేశారు. దీంతో ఈ జంట 2019 మార్చిలో మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది. 2021 మేలో తన భార్య గర్భం దాల్చినట్లు మేగాన్ ప్రకటించింది. నవంబర్లో తమ కుటుంబంలోకి మూడో వ్యక్తి రాబోతున్నట్లు వెల్లడించింది.
శుభాకాంక్షల వెల్లువ..
స్కట్- జెస్ దంపతులకు పాప జన్మించడం వల్ల ఆ జంటకు చాలా మంది విషెస్ చెబుతున్నారు. ఆసీస్ పేసర్ లారెన్ చీట్లే, ఆసీస్ క్రికెటర్ లీసా స్థలేకర్, న్యూజిలాండ్ మహిళ జట్టు కెప్టెన్ అమీ సత్తెర్వైట్, న్యూజిలాండ్ పేసర్ లీ టహుహు.. శుభాకాంక్షలు చెప్పిన వారిలో ఉన్నారు.
2012లో ఆసీస్ జట్టులోకి వచ్చిన మేగాన్.. ఇప్పటివరకు 65 వన్డేలు (99 వికెట్లు), 73 టీ20లు (96 వికెట్లు) ఆడింది. ఆసీస్ గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ గెలవడంలో మేగాన్ కీలకపాత్ర పోషించింది. 13 వికెట్లు తీసి టోర్నీలో ఎక్కువ వికెట్లు పడగొట్టిన ప్లేయర్గా నిలిచింది.
ఇదీ చదవండి: బిడ్డకు జన్మనివ్వనున్న స్వలింగ జంట