Australia Tour Of India 2023 T20 : ఆస్ట్రేలియాతో టీ20 సీరీస్ కోసం బీసీసీఐ.. రీసెంట్గా భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు కొత్త కుర్రాళ్లతో కూడిన 15 మంది జట్టుకు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించింది బోర్డు. ఈ 5 మ్యాచ్‌ల సిరీస్.. నవంబర్ 23 నుంచి ప్రారంభంకానుంది. అయితే ఎంతోకాలం నుంచి జట్టులో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఎదురుచూస్తున్న పలువురు యంగ్ ప్లేయర్లకు మరోసారి మళ్లీ నిరాశే ఎదురైంది.
రియాన్ పరాగ్.. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో 22 ఏళ్ల రియాన్ పరాగ్.. అదరగొట్టాడు. అతడు టోర్నీలో 182 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 510 పరుగులు చేశాడు. అందులో వరుసగా 7 సార్లు 50+ స్కోర్లు నమోదు చేశాడు. అయితే ఆ సిరీస్‌కు సీనియర్ ప్లేయర్లకు విశ్రాంతి ఇవ్వడం వల్ల.. టోర్నీలోనే టాప్ స్కోరర్‌గా నిలిచిన పరాగ్‌కు చోటు దక్కుతుందని భావించారు. కానీ, సెలక్టర్లు అతడివైపు మొగ్గు చూపలేదు.
అభిషేక్ శర్మ.. 23 ఏళ్లు అభిషేక్ 2023 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. అతడు 192 స్ట్రెక్‌రేట్‌తో 485 పరుగులు నమోదు చేశాడు. అందులో 2 సెంచరీలు, 3 అర్ధసెంచరీలు ఉన్నాయి. పరాగ్ తర్వాత ఈ టోర్నీలో అత్యధిక పరుగులు చేసింది అభిషేక్ శర్మే. అయితే పొట్టి ఫార్మాట్లో ఇంత మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ వీరికి నిరాశ తప్పలేదు.
సీనియర్ల పరిస్థితీ ఇదే.. అటు కుర్రాళ్లతో పాటు ఇటు సీనియర్లు సంజూ శాంసన్, యుజ్వేంద్ర చాహల్‌కు కూడా నిరాశే మిగిలింది. మళ్లీ వీరు మైదానంలో కనిపించాలంటే ఇంకా ఎంత కాలం ఎదురుచూడాలో?
-
Chumbai lobby worst thing to ever happen to indian cricket
— Kevin (@imkevin149) November 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Then dhawan and bhuvi now Yuzi and Sanju Samson chumbai lobby Needs to be exposed. pic.twitter.com/Ngq5Ao98Dy
">Chumbai lobby worst thing to ever happen to indian cricket
— Kevin (@imkevin149) November 21, 2023
Then dhawan and bhuvi now Yuzi and Sanju Samson chumbai lobby Needs to be exposed. pic.twitter.com/Ngq5Ao98DyChumbai lobby worst thing to ever happen to indian cricket
— Kevin (@imkevin149) November 21, 2023
Then dhawan and bhuvi now Yuzi and Sanju Samson chumbai lobby Needs to be exposed. pic.twitter.com/Ngq5Ao98Dy
భారత జట్టు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (WK), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.
ఆస్ట్రేలియా జట్టు: మాథ్యూ వేడ్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినీస్, జాష్ ఇంగ్లీస్, జాసన్ బెరన్‌డార్ఫ్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లీస్, స్పెన్సర్ జాన్సన్, తన్వీర్ సంఘా, సీన్ అబాట్.
-
🚨 NEWS 🚨#TeamIndia’s squad for @IDFCFIRSTBank T20I series against Australia announced.
— BCCI (@BCCI) November 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Details 🔽 #INDvAUShttps://t.co/2gHMGJvBby
">🚨 NEWS 🚨#TeamIndia’s squad for @IDFCFIRSTBank T20I series against Australia announced.
— BCCI (@BCCI) November 20, 2023
Details 🔽 #INDvAUShttps://t.co/2gHMGJvBby🚨 NEWS 🚨#TeamIndia’s squad for @IDFCFIRSTBank T20I series against Australia announced.
— BCCI (@BCCI) November 20, 2023
Details 🔽 #INDvAUShttps://t.co/2gHMGJvBby
టీమ్ఇండియా కెప్టెన్‌గా సూర్య- ఆసీస్‌తో సిరీస్‌కు జట్టు ప్రకటన