ETV Bharat / sports

కారు ప్రమాదంలో దిగ్గజ క్రికెటర్​ మృతి - కారు ప్రమాదంలో క్రికెటర్ మృతి

Australia cricketer Andrew symonds died: ఆస్ట్రేలియా క్రికెట్​లో షేన్​ వార్న్​ మరణం మరవకముందే మరో దిగ్గజ క్రికెటర్​ మృతిచెందాడు. మాజీ క్రికెటర్​ ఆండ్రూ సైమండ్స్​(46) ఓ కారు ప్రమాదంలో మరణించినట్లు అక్కడి పోలీసులు తెలిపారు.

Aussie cricket legend Andrew Symonds dies in car crash
కారు ప్రమాదంలో దిగ్గజ క్రికెటర్​ మృతి
author img

By

Published : May 15, 2022, 6:26 AM IST

Australia cricketer Andrew symonds died: ఆస్ట్రేలియా క్రికెట్​లో మరో విషాదం జరిగింది. దిగ్గజ క్రికెటర్​ ఆండ్రూ సైమండ్స్​(46) మరణించాడు. క్వీన్స్​లాండ్​లోని అలైస్​ రివర్​ బ్రిడ్జ్​ దగ్గర ఉన్న హెర్వే రేంజ్​ రోడ్​లో జరిగిన కారు ప్రమాదంలో అతడు మృతి చెందినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి 10.30గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు వెల్లడించారు.

ఇటీవలే ఆసీస్​ ప్లేయర్స్​ రాడ్​ మార్ష్​, స్పిన్​ దిగ్గజం షేన్ వార్న్​ కన్నుమూయగా.. ఇప్పుడు సైమండ్స్​ మరణించడంతో ఆసీస్​ క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది. అతడి మృతి పట్ల పలువురు క్రీడా ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. కెరీర్​లో ఆల్​రౌండర్​గా సత్తా చాటిన సైమండ్స్​.. మొత్తంగా 26టెస్టులు(1462 పరుగులు, 24 వికెట్లు), 198 వన్డేలు(5088, 133), 14 టీ20లు(337, 8), 39 ఐపీఎల్(974, 20) మ్యా​చులు ఆడాడు. ఆసీస్​ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన అతడు​ 2012లో అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు పలికాడు.

ఇదీ చూడండి: రాయుడు ట్వీట్​తో గందరగోళం.. సీఎస్​కే క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.