Asia Emerging Cup 2023 : ఎమర్జింగ్ ఆసియా కప్ వన్డే టోర్నమెంట్ సెమీస్‌లో భారత్ ఏ.. బంగ్లాదేశ్ ఏను చిత్తుచేసింది. ఆశల్లేని స్థితిలో అద్భుతంగా పుంజుకొని 51 పరుగుల తేడాలో విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఫైనల్స్‌లో అడుగుపెట్టింది. తుది పోరులో పాకిస్థాన్‌తో మరోసారి భారత్ ఏ తలపడనుంది. తన ఒంటరి పోరాటంతో భారత్‌కు ఆ మాత్రం గౌరవప్రదమైన స్కోరు అందించిన కెప్టెన్ యశ్ ధుల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
-
A FIFER from Nishant Sindhu inspires India 'A' to the Final of the #ACCMensEmergingTeamsAsiaCup 👏👏
— BCCI (@BCCI) July 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
India 'A' successfully defend the total and complete a 51-run win 🙌
Scorecard - https://t.co/XnH1m6JqPM #ACC pic.twitter.com/vgRAizbXIK
">A FIFER from Nishant Sindhu inspires India 'A' to the Final of the #ACCMensEmergingTeamsAsiaCup 👏👏
— BCCI (@BCCI) July 21, 2023
India 'A' successfully defend the total and complete a 51-run win 🙌
Scorecard - https://t.co/XnH1m6JqPM #ACC pic.twitter.com/vgRAizbXIKA FIFER from Nishant Sindhu inspires India 'A' to the Final of the #ACCMensEmergingTeamsAsiaCup 👏👏
— BCCI (@BCCI) July 21, 2023
India 'A' successfully defend the total and complete a 51-run win 🙌
Scorecard - https://t.co/XnH1m6JqPM #ACC pic.twitter.com/vgRAizbXIK
70/0 నుంచి 160 ఆలౌట్...
బంగ్లాదేశ్ - ఏ జట్టు కష్టతరం కాని 212 పరుగుల లక్ష్య ఛేదనను ఘనంగానే ఆరంభించింది. పవర్ ప్లేలో బంగ్లా ఓపెనర్లు ఎదురుదాడికి దిగి రన్‌రేట్ ఆరుకు తగ్గకుండా ఆడారు. పది ఓవర్ల ముగిసే సరికి ఆ జట్టు స్కోరు.. 60/0. ఇక భారత్ ఓటమి ఖాయమని అంతా భావించారు. కానీ అప్పుడే టీమ్ఇండియా ఆట మొదలైంది. బౌలర్ మానవ్ సుతార్ బంగ్లా ఓపెనర్ నయీమ్‌ను అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. తర్వాత నిషాంత్ సింధు.. మరో ఓపెనర్ హసన్‌ను వెనక్కిపంపాడు.
ఆ తర్వాత భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ.. ఆటపై పట్టు సాధించారు. బంగ్లా స్కోరు 100కు చేరేసరికి మూడు వికెట్లు నష్టపోయింది. ఇక చివర్లో ప్రత్యర్థి ఇన్నింగ్స్‌ను పేక మేడలా కూల్చారు. చివరి 30 పరుగుల వ్యవధిలో బంగ్లాదేశ్ చివరి 5 వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లలో నిషాంత్ సింధు 5 వికెట్లతో మెరిశాడు. మనవ్ సుతార్ మూడు వికెట్లు, ధొడియా, అభిషేక్ తలో వికెట్ పడగొట్టారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఇన్నింగ్స్ ఏడో ఓవర్లోనే దెబ్బ తగిలింది. గత మ్యాచ్ హీరో సుదర్శన్ 21 పరుగులకే పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన నికన్ జోస్ (17) కూడా నిరాశపర్చాడు. కాగా మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (34) క్రీజులో కుదురుకున్నట్లు కనిపించినా... జోస్ ఔటైన తరువాతి ఓవర్లలోనే అతడు కూడా డగౌట్ చేరాడు. మిడిల్ ఆర్డర్లో వచ్చిన నిషాంత్ సింధు (5) ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేపోయాడు. దీంతో భారత్ వందలోపే నాలుగు వికెట్లు పారేసుకుంది.
-
Leading from the front, the Yash Dhull way 👏
— BCCI (@BCCI) July 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
The India 'A' Captain received the Player of the Match award for his crucial 66 in the first innings 🙌
Scorecard - https://t.co/XnH1m6JqPM#ACCMensEmergingTeamsAsiaCup | #ACC pic.twitter.com/ZNi0ZjX4KN
">Leading from the front, the Yash Dhull way 👏
— BCCI (@BCCI) July 21, 2023
The India 'A' Captain received the Player of the Match award for his crucial 66 in the first innings 🙌
Scorecard - https://t.co/XnH1m6JqPM#ACCMensEmergingTeamsAsiaCup | #ACC pic.twitter.com/ZNi0ZjX4KNLeading from the front, the Yash Dhull way 👏
— BCCI (@BCCI) July 21, 2023
The India 'A' Captain received the Player of the Match award for his crucial 66 in the first innings 🙌
Scorecard - https://t.co/XnH1m6JqPM#ACCMensEmergingTeamsAsiaCup | #ACC pic.twitter.com/ZNi0ZjX4KN
ఈ దశలో కెప్టెన్ యశ్ ధుల్ (66) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనవసర షాట్లు ప్రయత్నించకుండా.. బాధ్యతాయుతంగా నిలకడగా ఆడుతూ.. హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. కానీ అతడికి మరో ఎండ్‌లో సహకారం కరవైంది. రియాన్ పరాగ్ (12), ధ్రువ్ జురెల్ (1), హర్షిత్ రాణా (9), హంగార్గేకర్ (15) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. చివర్లో మనవ్ సుతార్ (21) కూడా రనౌట్ అవ్వడం వల్ల భారత్ 211 పరుగులకే పరిమితం అయ్యింది.
సంక్షిప్త స్కోర్లు.
భారత్ ఏ - 211 (49.1 ఓవర్లు)
బంగ్లాదేశ్ ఏ - 160 (34.2).