ETV Bharat / sports

తొమ్మిదేళ్ల తర్వాత కోహ్లీ అలా.. ఆసియా కప్​లో ఎలా ఆడతాడో? - విరాట్​ కోహ్లీ ఆసియా కప్​ 2023

Asia Cup 2023 Virat Kohli : తొమ్మిదేళ్ల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత విరాట్​ కోహ్లీ ఆసియా కప్​ 2023లో ఆడనున్నాడు. ఈ మెగా టోర్నీలో విరాట్​ కోహ్లీ మంచి ప్రదర్శన చేయాలని అభిమానలు కోరుకుంటున్నారు.

Asia Cup 2023 Virat Kohli
Asia Cup 2023 Virat Kohli
author img

By

Published : Jun 17, 2023, 2:46 PM IST

Asia cup 2023 virat kohli : టీమ్​ఇండియా క్రికెటర్ విరాట్​ కోహ్లీ 9 సంవత్సరాల సుధీర్ఘ విరామం తర్వాత ఆసియాకప్​ 2023లో ఆడనున్నాడు. విరాట్​ చివరిసారిగా 2014 ఆసియా కప్​లో ఆడాడు. ఆ తర్వాత జరిగిన 2016 ఎడిషన్​లో కోహ్లీకి చోటు లభించలేదు. ఇక 2019 వన్డే వరల్డ్​ కప్​నకు ముందు 2018లో జరిగిన ఆసియా కప్​ ఎడిషన్​లో విశ్రాంతి తీసుకున్నందున కోహ్లీ ఆడలేదు. దీంతో ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్​ 17వ తేదీ వరకు జరగనున్న ఆసియా కప్ కోసం..​ తొమ్మిదేళ్ల తర్వాత మొదటిసారి ఆడనున్నాడు. దీంతో కోహ్లీ ప్రదర్శన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటి వరకు ఆడిన ఆసియా కప్​ల్లో విరాట్ కోహ్లీ 10 ఇన్నింగ్స్‌లలో 61.3 సగటుతో 613 పరుగులు చేశాడు. అందులో 183 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. ఏసీసీ టోర్నీలో ఇప్పటి వరకు ఒక అర్ధసెంచరీ, 3 సెంచరీలు సాధించాడు. దీంతో ఆగస్టులో ప్రారంభమవనున్న ఎడిషన్‌లో విరాట్ కోహ్లీ మంచి ప్రదర్శన చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Asia Cup 2023 : భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI), పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) మధ్య మాటల యుద్ధం సాగడం వల్ల ఆసియా కప్‌ నిర్వహణపై మొదట సందిగ్ధత నెలకొంది. పాకిస్థాన్‌కు తమ జట్టును పంపించేందుకు బీసీసీఐ నిరాకరించడం.. ఆ తర్వాత తమ టీమ్‌ కూడా భారత్‌ వేదికగా జరిగే ప్రపంచకప్‌లో పాల్గొనేది లేదని పీసీబీ పేర్కొంది. ఈ క్రమంలోనే తమ దేశంలో కొన్ని, తటస్థ వేదికల్లో కొన్ని మ్యాచ్‌లు నిర్వహించేలా హైబ్రిడ్‌ మోడల్‌ను పాక్‌ ప్రతిపాదించింది.

అయితే హైబ్రిడ్‌ మోడల్‌పై అసియా క్రికెట్​ మండలి (ఏసీసీ) సభ్యదేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. దీంతో టోర్నీ జరుగుతుందని ఏసీసీ వెల్లడించింది. పాకిస్థాన్‌లో నాలుగు మ్యాచ్‌లు, మిగిలిన 9 మ్యాచ్‌లు శ్రీలంక వేదికగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఏసీసీ ప్రతినిధులు తెలిపారు. భారత్​-పాక్​ దేశాల మధ్య నెలకొన్న రాజకీయ సంబంధాలు, భద్రత కారణాల దృష్ట్యా.. టీమ్​ఇండియా శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడనుంది. ఏదేమైనప్పటికీ దాదాపు 15 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌ టోర్నీకి అతిథ్యమిచ్చే అవకాశం పాకిస్థాన్‌కు రావడం గమనార్హం. దీంతో మరోసారి భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ను వీక్షించే అవకాశం అభిమానులకు రానుంది. అయితే శ్రీలంక వేదికగానే ఇరు జట్ల మ్యాచ్‌ జరగనుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.