Asia Cup 2023 IND VS PAK : చిరకాల ప్రత్యర్థులైన భారత్ - పాకిస్థాన్ జట్ల మధ్య ఏ స్థాయిలో మ్యాచ్ జరిగినా ఇరు దేశాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల్లో విపరీతంగా ఆసక్తి ఉంటుంది. అయితే ఈ రెండు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరిగి దాదాపు పదేళ్లు దాటిపోయింది. అప్పటి నుంచి కేవలం ఐసీసీ బడా టోర్నీల్లో మాత్రమే ఈ రెండు టీమ్‌లు తలపడుతున్నాయి. అందుకే ఈ మ్యాచులకు హైప్ కూడా మరింత ఎక్కువగా ఉంటుంది.
అయితే ఈ క్రమంలోనే త్వరలో జరిగే ఆసియా కప్.. ఆ తర్వాత జరిగే వన్డే ప్రపంచకప్ వేదికగా దాయాదుల మధ్య మ్యాచులు జరగనున్నాయన్న సంగతి తెలిసిందే. ఆసియా కప్ మరో మూడు రోజుల్లో గ్రాండ్‌గా ప్రారంభంకానుంది. దాయాది రెండు జట్లూ ఒకే గ్రూపులో ఉన్నాయి. కాబట్టి కచ్చితంగా రెండుసార్లు తలపడతాయి! అదే ఫైనల్ చేరితే మరోసారి టైటిల్ కోసం తలపడతాయి. ఈ మ్యాచుల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లు జరిగే వేదికల్లో హోటల్ రూమ్స్ కూడా భారీ ధరకు బుక్కైపోతున్నాయి.
ఈ క్రమంలో దాయాదుల పోరు ఎలా ఉంటుందనే దానిపై పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ మాట్లాడాడు. ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడూ ఆసక్తరంగానే ఉంటుందని చెప్పాడు. ఈ మ్యాచ్ కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. ఈ రెండు జట్ల మధ్య పోటీ ఎంతో ఆసక్తిగా ఉంటుందని, అభిమానులతో పాటు ప్లేయర్స్ కూడా దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారని చెప్పాడు. "రెండు జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడూ ఎంతో ఆసక్తికరంగా, గొప్పగా ఉంటుంది. ప్రపంచమొత్తం ఈ మ్యాచ్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. భారత్ పాకిస్థాన్ మ్యాచుల్లో క్రికెట్ స్థాయి అత్యుత్తమంగా ఉంటుంది. అలాగే గట్టి పోటీ ఉంటుంది. మేం అదే కోరుకుంటాం. ఇరు జట్ల ఆటగాల్లు నూటికి నూరు శాతం తమ వంతుగా బెస్ట్ ఎఫర్ట్ పెట్టి ఆడతారు. లేదంటే అభిమానులు ఆ మజాను మిస్ అవుతారు" అని బాబార్ ఆజామ్ పేర్కొన్నాడు. కాగా, భారత్ - పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్ సెప్టెంబర్ 2న జరగనుంది.
ICC Latest ODI Rankings : వన్డేల్లో నెం.1గా పాకిస్థాన్.. మరి టీమ్ఇండియా స్థానం ఎంతో తెలుసా?
Asia Cup 2023 Covid : ఆసియా కప్‌నకు కొవిడ్ ముప్పు.. అక్కడ్నుంచే వ్యాప్తి చెందిందా?