ETV Bharat / sports

Asia Cup 2023 IND Vs BAN : ఖాతా తెరవకుండానే పెవిలియన్​కు రోహిత్.. అరంగేట్రంలో నిరాశపర్చిన తెలుగు కుర్రాడు

Asia Cup 2023 IND Vs BAN : బంగ్లాదేశ్​తో జరుగుతున్న మ్యాచ్​లో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. డకౌటయ్యాడు. బంగ్లా అరంగేట్ర ప్లేయర్ తన్​జిమ్ హసన్​కు వికెట్ సమర్పించుకున్నాడు.

Asia Cup 2023 IND Vs BAN
Asia Cup 2023 IND Vs BAN
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 9:58 PM IST

Updated : Sep 15, 2023, 10:36 PM IST

Asia Cup 2023 IND Vs BAN : 2023 ఆసియా కప్ సూపర్-4 లో భాగంగా భారత్.. బంగ్లాదేశ్​తో తలపడుతోంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా 50 ఓవర్లకు 265-8 పరుగులు చేసింది. అనంతరం 266 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్​కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశ పరిచాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్​లోనే బంగ్లాదేశ్ అరంగేట్ర ఆటగాడు తన్​జిమ్ హసన్​కు.. పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ సమర్పించుకున్నాడు. ఈ క్రమంలో రోహిత్ వన్డేల్లో 15వ సారి డకౌటయ్యాడు. దీంతో అత్యధిక సార్లు డకౌటైన భారత ఆటగాళ్ల జాబితాలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరసన చేరాడు.

గత మ్యాచ్​లో కూడా రోహిత్.. 20 ఏళ్ల శ్రీలంక స్పిన్నర్ వెల్లలాగే బౌలింగ్​లో క్లీన్ బౌల్డయ్యాడు. అయితే ప్రపంచంలోని మేటి బౌలర్లను సమర్థంగా ఎదుర్కొనే రోహిత్.. ప్రపంచకప్​కు ముందు ఇలా వరుస మ్యాచ్​ల్లో అనుభవం లేని కుర్రాళ్లకు వికెట్ సమర్పించుకోవడం వల్ల ఫ్యాన్స్​ ఆందోళనకు గురవుతున్నారు.

తిలక్ కూడా తొందరగానే.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఈ మ్యాచ్​తో అరంగేట్రం చేశాడు. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ అతడికి డెబ్యూ క్యాప్​ అందించి జట్టులోకి స్వాగతం పలికాడు. అయితే ఎన్నో అంచనాలతో బ్యాటింగ్​కు దిగిన తిలక్ (5 పరుగులు).. తొందరగానే పెవిలియన్ చేరాడు. అతడు కూడా తన్​జిమ్ హసన్​కే చిక్కాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో క్లీన్​ బౌల్డయ్యాడు.

సెంచరీతో కదంతొక్కిన గిల్.. టీమ్ఇండియా బ్యాటర్లు ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరుకున్న తరుణంలో యువ సంచలనం శుభ్​మన్ గిల్ శతకంతో అదగొట్టాడు. బంగ్లా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ 8 ఫోర్లు, 4 సిక్సర్లు సహాయంతో.. కెరీర్​లో 5వ సెంచరీ నమోదు చేశాడు. ఇక వేగంగా ఆడే క్రమంలో 43.3 ఓవర్ల వద్ద గిల్ (121).. స్పిన్నర్ మహెదీ హసన్ బౌలింగ్​లో క్యాచ్​ ఔటయ్యాడు.

Tanzim Hasan Sakib Debut : మరోవైపు ఇదే మ్యాచ్​లో అరంగేట్రం బంగ్లా చేసిన బౌలర్.. తన్​జిమ్ హసన్​ షకిబ్​కు కెరీర్​లో అదిరే ఆరంభం దక్కింది. అతడు టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ వికెట్ దక్కించుకున్నాడు.

ICC ODI Rankings : పాకిస్థాన్​కు షాకిచ్చిన టీమ్​ఇండియా.. నెం.1గా ఆసీస్​.. కొత్త లెక్కలు ఇవే!

Asia Cup 2023 IND Vs BAN : బంగ్లా ఇన్నింగ్స్​ కంప్లీట్​.. ఆదుకున్న కెప్టెన్​.. భారత్ లక్ష్యం ఎంతంటే?

Last Updated : Sep 15, 2023, 10:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.