Asia Cup 2023 Final IND Vs SL : మినీ టోర్నీ ఆసియా కప్-2023 చివరి దశకు చేరుకుంది. అయితే ఈ టోర్నీలో మరోసారి చిరకాల ప్రత్యర్థులు భారత్- పాకిస్థాన్ మధ్య ఫైనల్ మ్యాచ్‌ను చూడాలనుకున్న ఫ్యాన్స్ కల కలగానే మిగిలిపోయింది. గురువారం జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన శ్రీలంక.. 11వ సారి ఫైనల్‌కు దూసుకెళ్లింది.
-
The Battle for the Asian Crown! 🏆👑
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Join us on September 17th at RPICS, Colombo for an epic showdown!
Secure your tickets today - https://t.co/9abfJNKjPZ#AsiaCup2023 #SLvIND pic.twitter.com/jsYVGgVkLM
">The Battle for the Asian Crown! 🏆👑
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 14, 2023
Join us on September 17th at RPICS, Colombo for an epic showdown!
Secure your tickets today - https://t.co/9abfJNKjPZ#AsiaCup2023 #SLvIND pic.twitter.com/jsYVGgVkLMThe Battle for the Asian Crown! 🏆👑
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 14, 2023
Join us on September 17th at RPICS, Colombo for an epic showdown!
Secure your tickets today - https://t.co/9abfJNKjPZ#AsiaCup2023 #SLvIND pic.twitter.com/jsYVGgVkLM
ఆసియా కప్‌లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి.. కప్పు కొట్టడం అలవాటుగా మార్చుకుంది శ్రీలంక సేన. గతేడాది కూడా ఫైనల్ చేరడమే కష్టం అనుకుంటే ఏకంకా ట్రోఫీనే పట్టేసింది. ఈసారి కూడా క్రీడా విశ్లేషకులు భారత్, పాక్ ఫైనల్ చేరుకుంటాయని జోస్యం చెప్పగా.. లాస్ట్ బాల్ థ్రిల్లింగ్ మ్యాచ్‌లో గెలిచి లంక ఫైనల్ చేరింది. ఆదివారం.. టీమ్ఇండియాతో పోటీపడనుంది.
-
How are the heart rates and blood pressures doing now?#SLvPAK #AsiaCup2023 https://t.co/zMAZrOVk4l
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">How are the heart rates and blood pressures doing now?#SLvPAK #AsiaCup2023 https://t.co/zMAZrOVk4l
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 14, 2023How are the heart rates and blood pressures doing now?#SLvPAK #AsiaCup2023 https://t.co/zMAZrOVk4l
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) September 14, 2023
టీమ్ఇండియా ఫైనల్‌కు చేరుకుందన్న విషయం పక్కనపెడితే.. అభిమానులను మరో విషయం తీవ్రంగా కలవరపెడుతోంది. స్వదేశంలో శ్రీలంకకు ఆసియా కప్‌లో తిరుగులేని రికార్డు ఉంది. గతంలో నాలుగుసార్లు ఆసియా కప్ టోర్నీకి ఆతిథ్యమిచ్చిన శ్రీలంక.. మూడుసార్లు ఆ జట్టే విజేతగా నిలిచింది. ఒక్కసారి మాత్రమే 2010లో భారత్ విజయం సాధించింది.
Asia Cup 2023 Final : సెప్టెంబర్ 17వ తేదీన ఫైనల్ జరగబోతున్న కొలంబోలో కూడా శ్రీలంక రికార్డు మరింత మెరుగ్గా ఉంది. అక్కడ ఫైనల్ మ్యాచ్ జరిగిన ప్రతీసారి లంకనే గెలిచింది. 2010లో భారత్ కప్‌ను గెలిచినప్పుడు.. ఫైనల్ మ్యాచ్ డంబుల్లాలో జరిగింది. ధోనీ కెప్టెన్సీలోని టీమ్ఇండియా.. ఆ ఫైనల్లో 81 పరుగులతో లంకను చిత్తు చేసి ఆసియా కప్ గెలిచింది.
-
Following an exhilarating win last night, the Lions have clinched their spot in the finals and are scheduled to take on India on the 17th! 💪#AsiaCup2023 pic.twitter.com/DkDq85IUVY
— AsianCricketCouncil (@ACCMedia1) September 15, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Following an exhilarating win last night, the Lions have clinched their spot in the finals and are scheduled to take on India on the 17th! 💪#AsiaCup2023 pic.twitter.com/DkDq85IUVY
— AsianCricketCouncil (@ACCMedia1) September 15, 2023Following an exhilarating win last night, the Lions have clinched their spot in the finals and are scheduled to take on India on the 17th! 💪#AsiaCup2023 pic.twitter.com/DkDq85IUVY
— AsianCricketCouncil (@ACCMedia1) September 15, 2023
స్వదేశంలో శ్రీలంక ఆసియా కప్ రికార్డులు ఇవే
- ఆసియా కప్‌ను శ్రీలంక తొలిసారి 1986లో గెలుచుకుంది. అప్పుడు కొలంబోలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో ఫైనల్ జరిగింది. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 5 వికెట్లతో చిత్తు చేసి ట్రోఫీ గెలిచింది శ్రీలంక.
- 1997లో శ్రీలంక రెండోసారి ట్రోఫీ గెలిచింది. ఇప్పుడు ఫైనల్ జరగబోతున్న కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలోనే అప్పుడు కూడా ఫైనల్ జరిగింది. ఆ మ్యాట్‌లో భారత్‌ను 8 వికెట్లతో ఓడించి శ్రీలంక టైటిల్ కొట్టేసింది.
- 2004లోనూ సీన్ రిపీట్. ప్రేమదాస స్టేడియంలో ఫైనల్ జరగ్గా.. శ్రీలంక 25 పరుగులతో గెలిచి ఆసియా కప్‌ను మూడోసారి కైవసం చేసుకుంది.
- చివరిసారి శ్రీలంకలో 2010లో ఆసియా కప్ జరిగింది. అప్పుడు ఫైనల్ డంబుల్లాలోని రణగిరి డంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగింది. ఆ మ్యాచ్‌లో శ్రీలంకను 81 పరుగులతో చిత్తు చేసిన భారత్.. ఆసియా కప్ గెలిచింది.
అండర్ డాగ్స్‌తో డేంజరే..
Asia Cup 2023 Sri Lanka Records : ఈసారి కూడా డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంక బరిలోకి దిగినా.. ఫైనల్ చేరుతుందని ఎవరూ అనుకోలేదు. కానీ అనూహ్య రీతిలో భారత్ చేతుల్లో ఓడినా.. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లను చిత్తు చేసి ఫైనల్ చేరింది. సూపర్ 4లో ఒకింత టీమ్ఇండియాను భయపెట్టింది. పాకిస్థాన్‌తో శ్రీలంక ఆడిన విధానం చూస్తే మాత్రం ఆ జట్టును ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి లేదు. అందులోనూ స్వదేశం, పైగా తమకు బాగా కలిసొచ్చే ప్రేమదాస స్టేడియంలో ఈసారి లంక మళ్లీ ఏం మాయ చేస్తుందో అన్న ఆందోళన అటు టీమ్ఇండియాలో, ఇటు అభిమానుల్లో ఉంది.