ETV Bharat / sports

ఆసియా కప్​ వేదిక మార్పు.. ఎక్కడంటే?

Asia cup 2022: ఆసియా కప్​ నిర్వహణపై ఏషియన్​ క్రికెట్​ కౌన్సిల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. శ్రీలంకలో సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో వేదికను యూఏఈకి తరలిస్తున్నట్లు అధ్యక్షుడు జైషా పేర్కొన్నారు. ప్రపంచకప్​ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆసియా జట్లకు ఈ టోర్నీ కీలకంగా మారనుందని తెలిపారు.

asia cup
ఆసియా కప్
author img

By

Published : Jul 28, 2022, 11:51 AM IST

Asia cup 2022 venue: శ్రీలంకలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఆసియా కప్​ను యూఏఈకి తరలించాలని భావిస్తున్నట్లు ఇటీవల బీసీసీఐ చీఫ్​ ​గంగూలీ పేర్కొన్నారు. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా ఏషియన్ క్రికెట్​ కౌన్సిల్ (ఏసీసీ) ప్రకటించింది. టోర్నీని యూఏఈలోనే నిర్వహిస్తున్నట్లు కన్ఫార్మ్​ చేసింది. ఇదివరకు నిర్ణయించిన షెడ్యూల్​ ప్రకారమే ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఈ టోర్నీ జరగనున్నట్లు స్పష్టం చేసింది.

"ఆసియా కప్​ను శ్రీలంకలోనే నిర్వహించాలని చివరి దాకా ప్రయత్నించాము. కానీ అక్కడ పరిస్థితులు అనుకూలించని నేపథ్యంలో యూఏఈకి మారుస్తున్నారు. శ్రీలంక క్రికెట్​ బోర్డే ఆతిథ్యం ఇవ్వనుంది. టీ20 ప్రపంచకప్​ దగ్గరపడుతున్న నేపథ్యంలో ఈసారి జరగనున్న టోర్నీ ఆసియా దేశాల జట్లకు చాలా కీలకంగా మారింది. యూఏఈలో టోర్నీ నిర్వహణకు సహకరించిన శ్రీలంక క్రికెట్​ బోర్డు, ఎమిరేట్స్​ క్రికెట్​ బోర్డులకు ధన్యవాదాలు."

-జై షా, ఏషియన్ క్రికెట్​ కౌన్సిల్ అధ్యక్షుడు

టీ20 ఫార్మాట్​లో జరగనున్న ఈ టోర్నీలో మొత్తం ఆరు దేశాలకు చెందిన జట్లు పాల్గొంటాయి. యూఏఈలో ఆసియా కప్​ నిర్వహించడం ఇది తొలిసారి కాదు. అంతకుముందు 2018లో కూడా వన్డే ఫార్మాట్​లో ఆసియా కప్​ను నిర్వహించారు. ఆ టోర్నీలో టీమ్​ఇండియా విజేతగా నిలిచింది.

ఇదీ చూడండి : కామన్వెల్త్​ గేమ్స్​.. ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.