Angelo Mathews Timed Out : 2023 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా దిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో శ్రీలంక-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో వివాదాస్పద ఘటన జరిగింది. క్రీజులోకి ఆలస్యంగా వచ్చిన కారణంగా శ్రీలంక ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌ను టైమ్‌డ్ ఔట్ ప్రకటించారు అంపైర్లు. అయితే అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో ఇలా ఓ బ్యాటర్ ఔటవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
'హెల్మెట్ సరిగ్గా లేదనే.. ఆలస్యం..'
అంతకుముందు శ్రీలంక బ్యాటర్ సధీర సమరవిక్రమ ఔట్ అయిన తర్వాత.. ఆల్‌రౌండర్ మాథ్యూస్ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. ఈ క్రమంలో మాథ్యూస్.. దాదాపు దాదాపు 120 సెకన్ల తర్వాత క్రీజులోకి వచ్చాడు. అయితే సగటు బ్యాటర్ క్రీజులోకి ఆలస్యంగా వచ్చాడంటూ.. అతడ్ని టైమ్‌డ్ ఔట్‌గా ప్రకటించాలని బంగ్లా ఆటగాళ్లు అప్పీల్ చేశారు. దీంతో మాథ్యూస్‌పై టైమ్‌డ్ ఔట్ వేటు వేశారు అంపైర్లు. అయితే తాను ధరించే హెల్మెట్ పట్టీలు బాగా లేవని.. దానిని మార్చుకునే క్రమంలోనే బ్యాటింగ్‌కు రావడం ఆలస్యమైందని మాథ్యూస్ మైదానంలో ఉన్న అంపైర్లకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినప్పటికీ అతడి వాదనను అంపైర్లు ఎరాస్మస్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ పట్టించుకోలేదు. దీంతో మాథ్యూస్ బ్యాటింగ్ చేయకుండానే పెవిలియన్ బాట పట్టాడు. ఆ సమయంలో శ్రీలంక 24.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది.
-
Angelo Mathews became the first batter in international cricket to be dismissed in this manner 👀
— ICC (@ICC) November 6, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Why was he given out? 🧐#CWC23 #BANvSLhttps://t.co/4VS5s1Nf5s
">Angelo Mathews became the first batter in international cricket to be dismissed in this manner 👀
— ICC (@ICC) November 6, 2023
Why was he given out? 🧐#CWC23 #BANvSLhttps://t.co/4VS5s1Nf5sAngelo Mathews became the first batter in international cricket to be dismissed in this manner 👀
— ICC (@ICC) November 6, 2023
Why was he given out? 🧐#CWC23 #BANvSLhttps://t.co/4VS5s1Nf5s
ఏంటీ టైమ్‌డ్ ఔట్ రూల్..?
ఐసీసీ నిబంధనల్లోని ఆర్టికల్ 40.1.1 నిబంధనల ప్రకారం.. బ్యాటర్ ఔట్ అయిన తర్వాత లైనప్‌లో ఆడాల్సిన మరో బ్యాటర్ రెండు నిమిషాలు లేదా అంతలోపు మైదానంలోకి రావాల్సి ఉంటుంది. ఒకవేళ సమయం ముగిసిన తర్వాత బ్యాటింగ్‌కు దిగితే అతడిని ఆ ఇన్నింగ్స్‌ను ఆడేందుకు అనర్హుడిగా ప్రకటిస్తారు అంపైర్లు. ఈ విషయంలో అంపైర్లకు అధికారం ఉంటుంది. ఆర్టికల్ 40.1.2 ప్రకారం సదరు బ్యాటర్‌ను టైమ్‌డ్ ఔట్‌గా ప్రకటించే పూర్తి అధికారం అంపైర్లకు ఉంటుంది.
దేశీయ క్రికెట్‌లో..
అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక ఆటగాడు టైమ్‌డ్ ఔటైన సందర్భాలు ఇప్పటి వరకు ఒక్కటి కూడా జరగనప్పటికీ.. దేశీయ క్రికెట్‌లో మాత్రం ఇలాంటి ఘటన జరిగింది. 1997లో ఒడిశాలోని కటక్‌లో త్రిపుర్, ఒడిశా జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హేములాల్ యాదవ్ అనే ప్లేయర్ టైమ్‌డ్ ఔట్‌కు గురయ్యాడు.
శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు- భారత్ చేతిలో ఘోర ఓటమే కారణం!
'విరాట్‌పై ఆ బరువు దిగిపోయింది - ఇకపై మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తాడు'