Ajit Agarkar Team Selection : ఆసియా కప్ 2023 టోర్నమెంట్ కోసం టీమ్ఇండియా జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. స్టాండ్‌బై ఆటగాడితో పాటు మొత్తం 18 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. చాలా కాలం నుంచి నిలకడగా రాణిస్తున్న యుజ్వేంద్ర చాహల్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. అయితే జట్టు ప్రకటన ఈ సందర్భంగా.. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ మీడియాతో మాట్లాడారు. జట్టు కూర్పుపై ఈ ప్రెస్మీట్లో వివరణ ఇచ్చారు.
చాహల్‌పై వేటు..
Yuzvendra Chahal : టీమ్ఇండియా జట్టులో గత కొద్ది కాలంగా అద్భుతమైన ప్రదర్శన చేస్తున్న చాహల్‌ను.. దురదృష్టవశాత్తు వదులుకోవాల్సి వచ్చిందని ఆగార్కర్ అన్నాడు. కానీ ఇప్పుడున్న జట్టులో అతడి కంటే కుల్దీప్ యాదవ్ మెరుగ్గా ఆడుతున్నాడని ఆయన తెలిపాడు. ఇక ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లను ఎంపిక చేసే పరిస్థితి ప్రస్తుతం లేదని.. అందుకే అక్షర్ పటేల్‌ను తీసుకున్నట్లు ఆగార్కర్ పేర్కొన్నాడు. అయితే రానున్న ప్రపంచకప్‌కు దాదాపు ఇదే జట్టును ఎంపిక చేయవచ్చన్న కథనాలు వస్తున్న వేళ.. చాహల్‌కు ఇంకా అవకాశాలు ఉన్నాయని రోహిత్ స్పష్టం చేశాడు.
Shikhar Dhawan : ప్రెస్మీట్లో టీమ్ఇండియా సీనియర్ ప్లేయర్ శిఖర్ ధావన్ గురించి మీడియా అడగ్గా.. "అవును ధావన్ నాణ్యమైన ఆటగాడే. కానీ ప్రస్తుతం మాకు ముగ్గురు ఓపెనర్లు అందుబాటులో ఉన్నారు. వారంతా అద్భుతంగా రాణిస్తున్నారు" అని అగార్కర్ అన్నాడు.
Sanju Samson : ఇక శ్రేయస్ అయ్యర్, కే ఎల్ రాహుల్ గాయాల నుంచి కోలుకున్నారు. శ్రేయస్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. రాహుల్ కూడా ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెడుతున్నాడని అగార్కర్ తెలిపాడు. అయినప్పటికీ ముందుజాగ్రత్తగా శాంసన్‌ను రిజర్వ్ ప్లేయర్‌గా జట్టులో తీసుకున్నట్లు ఆగార్కర్ స్పష్టం చేశాడు.
Tilak Varma Asia Cup : ఇప్పటికీ వన్డేల్లో అరంగేట్రం చేయకున్నా సెలక్టర్లు తిలక్ వర్మకు మొగ్గుచూపారు. ఆసియా కప్‌లో రాణిస్తే.. మెగాటోర్నీకి కూడా తిలక్ సెలెక్ట్ ఛాన్స్‌లు ఉన్నాయంటూ పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నారు.
Prasidh Krishna Asia Cup : ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో నిలకడగా రాణిస్తున్న పేసర్ ప్రసిద్ కృష్ణకు పిలుపు అందింది. కాగా ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌ల్లో ప్రసిద్ 4 వికెట్లు తీశాడు.
ODI World Cup 2023 Hyderabad Schedule : ఉప్పల్ మ్యాచ్ రీ షెడ్యూల్ పై స్పందించిన బీసీసీఐ!