ETV Bharat / sports

'యువ క్రికెటర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు' - యువ ఆటగాళ్లపై గంభీర్ వ్యాఖ్య

ముస్తాక్​ అలీ ట్రోఫీ నేటి(నవంబర్ 4) నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో టీమ్​ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్(Gambhir News) యువ ఆటగాళ్లకు పలు సూచనలు చేశాడు. యువ ఆటగాళ్లు ఈ టోర్నీని బాగా ఉపయోగించుకోవాలని తెలిపాడు.

gambhir
గౌతమ్ గంభీర్
author img

By

Published : Nov 4, 2021, 6:57 AM IST

Updated : Nov 4, 2021, 7:20 AM IST

"ఈసారి సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో(Mushtaq Ali Trophy 2021) 38 జట్లు కలిసి 105 మ్యాచ్‌లు ఆడనున్నాయి. జట్ల లక్ష్యం ట్రోఫీ అందుకోవడమే. వ్యక్తిగతంగా ఆటగాళ్లకు మాత్రం ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలను ఆకట్టుకోవడమే ప్రథమ లక్ష్యం" అని టీమ్​ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్(Gambhir News) అభిప్రాయపడ్డాడు.

"రెండు కొత్త జట్లు ఐపీఎల్‌లో చేరిన నేపథ్యంలో ఈసారి వేలం భారీ స్థాయిలో జరగనుంది. దేశవాళీ నైపుణ్యం పరిశీలించేందుకు ఫ్రాంఛైజీలన్నీ తమ బృందాలను వివిధ వేదికలను కచ్చితంగా పంపిస్తాయి. వచ్చే 2-3 నెలలు కుర్రాళ్లకు కీలకం. చక్కటి ప్రదర్శనకు తోడు అదృష్టం కలిసొస్తే వాళ్లు రాత్రికి రాత్రి కోటీశ్వరులవుతారు."

-గౌతమ్ గంభీర్, మాజీ క్రికెటర్.

అయితే.. కొందరు సీనియర్లు జూనియర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని గంభీర్ పేర్కొన్నాడు. "సెలక్టర్లను ఆకట్టుకోవడంలో విఫలమవుతున్న ఓ క్రికెటర్‌ ప్రస్తుతం రంజీని వదిలేసి పూర్తిగా సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీపైనే దృష్టి సారించాడు. అతడు నాతో కలిసి టీమ్‌ఇండియాకు ఆడాడు కూడా. అప్పుడు పూర్తి అంకితభావంతో ఆడాడు. ఇప్పుడు మాత్రం ఫ్రాంఛైజీ క్రికెట్లోనే డబ్బుందని భావిస్తున్నాడు. యువ క్రికెటర్లకూ అదే హితబోధ చేస్తుండటమే ఆందోళన కలిగిస్తోంది" అని గంభీర్ అన్నాడు. దీనికి సరైన పరిష్కారాన్ని బోర్డు కనుగొనాలని, ఆటగాళ్లు అన్ని ఫార్మాట్లు ఆడేలా చేయాలని తెలిపాడు.

నేటి నుంచే ముస్తాక్‌ అలీ టోర్నీ

సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ట్రోఫీ గురువారం(నవంబర్ 4) ఆరంభంకానుంది. మొత్తం 38 జట్లను అయిదు ఎలైట్‌, ఓ ప్లేట్‌ గ్రూపుగా విభజించి మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఎలైట్‌ గ్రూపులో అయిదు చొప్పున, ప్లేట్‌ గ్రూపులో ఎనిమిది చొప్పున జట్లు ఉన్నాయి. ఎలైట్‌ గ్రూప్‌- సిలో ఆంధ్ర, గ్రూప్‌- ఈలో హైదరాబాద్‌ ఉన్నాయి. గురువారం సౌరాష్ట్రను హైదరాబాద్‌.. జమ్మూ కశ్మీర్‌ను ఆంధ్ర ఢీకొననున్నాయి.

ఇదీ చదవండి:

టీమ్​ఇండియా కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్

Last Updated : Nov 4, 2021, 7:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.