టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్ఇండియా ప్రధాన్ కోచ్ పదవీ కాలం పూర్తి చేసుకోనున్నాడు రవిశాస్త్రి(ravi shastri news). ఇప్పటికే తాను కోచ్‌గా సాధించిన ఘనతల పట్ల సంతృప్తిగా ఉన్నానని తెలపడం వల్ల అతడిని మరోసారి కోచ్‌గా ఎంపిక చేసే ఉద్దేశ్యం లేనట్లే తెలుస్తోంది. దీంతో ఇతడి స్థానంలో పలువురి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా ఇదే విషయంపై స్పందించిన భారత జట్టు మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్.. రవిశాస్త్రి(ravi shastri news) తర్వాత ద్రవిడ్(rahul dravid coach news), ధోనీ(ms dhoni mentor for t20) కీలక బాధ్యతలు తీసుకోవాలని అభిప్రాయపడ్డాడు.
"రవిశాస్త్రి(ravi shastri news) కోచ్ పదవి నుంచి తప్పుకొన్నాక జట్టుకు మెంటార్‌గా ధోనీ(ms dhoni mentor for t20), కోచ్‌గా ద్రవిడ్(rahul dravid coach news)సేవలందిస్తారని అనుకుంటున్నా. ఐపీఎల్ 2021లో భాగంగా కామెంటరీ చేస్తున్న సమయంలో సహ వ్యాఖ్యాలతో ఇదే విషయమై చర్చించాం. ద్రవిడ్ తెలివైనవాడు. రవి తర్వాత అతడి సేవలు జట్టుకు చాలా అవసరం. ఒకవేళ ధోనీ, ద్రవిడ్ ఆ బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు రాకపోతే నేను చాలా బాధపడతా. వీరి మార్గదర్శకత్వంలో టీమ్ఇండియా ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది."
-ఎంఎస్కే ప్రసాద్, టీమ్ఇండియా మాజీ చీఫ్ సెలెక్టర్
జాతీయ శిక్షణ శిబిరం (NCA) చీఫ్‌గా యువ క్రికెటర్లను తీర్చడంలో కీలకపాత్ర పోషించాడు ద్రవిడ్(rahul dravid coach news). మరోసారి ఆ బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగే ధోనీ(ms dhoni mentor for t20) ఇటీవలే టీ20 ప్రపంచకప్ 2021లో భారత జట్టుకు మెంటార్‌గా ఎంపికయ్యాడు.