ETV Bharat / sports

స్టన్నింగ్​ క్యాచ్​​.. గాల్లోకి ఎగిరి మరీ.. సచిన్ బంతిని భలే పట్టేశాడుగా!

సోషల్​మీడియాలో ఓ క్రికెటర్​ పట్టుకున్న అద్భుత క్యాచ్​కు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. దాదాపు రెండు దశాబ్దాల కింద జరిగిన మ్యాచ్​లో చోటు చేసుకున్న సూపర్ మూమెంట్​ ఇది. అయితే ఆ బంతి దిగ్గజ క్రికెటర్​ సచిన్ తెందుల్కర్​ది కావడం మరో విశేషం. ఆ వీడియో మీరు చూసేయండి..

Adam Bacher stunning catch viral
సచిన్ బంతిని భలే పట్టేశాడుగా
author img

By

Published : Oct 29, 2022, 8:13 PM IST

Updated : Oct 29, 2022, 8:27 PM IST

క్రికెట్​లో అప్పుడప్పుడూ అసాధారణ విన్యాసాలు చూస్తూనే ఉంటాం. బ్యాటర్ల సూపర్​ షాట్స్​, ఫీల్డర్స్​ మెరుపు విన్యాసాలు.. ఇలా ఎన్నో సూపర్‌ మూమెంట్స్‌ చోటు చేసుకుంటాయి. అయితే తాజాగా ఓ క్రికెటర్​ పట్టుకున్న స్టన్నింగ్ క్యాచ్​ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ మ్యాచ్‌ జరిగి రెండు దశాబ్దాలు అయినా ఇప్పటికీ ఆ సూపర్​ క్యాచ్​ మాత్రం వావ్‌ అనిపిస్తోంది.

1997లో కేప్‌టౌన్‌ వేదికగా భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఓ ఫీల్డింగ్‌ మూమెంట్‌ ఆశ్చర్యపరచడమే కాదు.. ఆల్‌ టైమ్‌ టాప్‌-10 క్యాచెస్‌లో ఒకటిగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 1997లొ కేప్‌టౌన్‌ వేదికగా టెస్టు మ్యాచ్‌ జరగ్గా, ఆడమ్‌ బాచెర్‌ ఒక సూపర్​ క్యాచ్‌ గాల్లోకి ఎగిరి అందుకున్నాడు. అది కూడా భారత దిగ్గజ ఆటగాడు సచిన్‌ టెండూల్కర్‌ బాదిన బంతినే.

  • Happy Birthday Adam Bacher 🇿🇦.
    The nephew of cricket supremo Ali Bacher. Played 19 Tests & Scored 833 with 96 His top Score
    One of Best Catch he Taken in 90s of @sachin_rt in Cape Town 1997 & even this catch should in all time top 10 catches. pic.twitter.com/20eEI0gnwV

    — Zohaib (Cricket King) 🏏 (@Zohaib1981) October 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మెక్‌మిలాన్‌ బౌలింగ్​లో భారీ షాట్‌ ఆడబోయిన సచిన్‌.. ఆడమ్‌ మార్క్‌ బాచెర్‌ పట్టిన అద్భుతమైన ‍క్యాచ్‌తో వెనుదిరిగాల్సి వచ్చింది. బంతి గాల్లో ఉండగానే దాన్ని వెంటాడిన బాచెర్‌.. ఒంటి చేత్తో అందుకుని శభాష్‌ వావ్​ అనిపించాడు. నేడు(అక్టోబర్‌ 29వ తేదీ) మార్క్‌ బాచెర్‌ బర్త్‌ డే సందర్భంగా ఈ క్యాచ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆనాటి మ్యాచ్‌ సదరు ఇన్నింగ్స్‌లో సచిన్‌ 169 పరుగులు చేశాడు.

ఇదీ చూడండి: 'కోహ్లీ పరిపూర్ణ ఆటగాడు.. అది అతడికే మాత్రమే సాధ్యం'

Last Updated : Oct 29, 2022, 8:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.