దేశవాళీ క్రికెట్లో విదర్భ యువ బౌలర్ సత్తాచాటాడు. టీ20 చరిత్రలో నాలుగు మెయిడిన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్గా నిలిచాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో(Syed Mushtaq Ali Trophy) భాగంగా హ్యాట్రిక్ సాధించిన అక్షయ్ కర్నెవార్ మరో ఘనత తన ఖాతాలో వేసుకున్నాడు(Vidarbha Bowler).
రెండు చేతులతో బౌలింగ్ చేసే సామర్థ్యం ఉన్న అక్షయ్.. బుధవారం, సిక్కిం జట్టుతో మ్యాచ్లో వికెట్లు తీయడంలో హ్యాట్రిక్ నమోదు చేశాడు. 8వ ఓవర్ చివరి రెండు బంతుల్లో ఇద్దరిని ఔట్ చేశాడు అక్షయ్. తర్వాత వేసిన ఓవర్ మొదటి బంతికే మరో వికెట్ తీశాడు. మొత్తంగా ఈ మ్యాచ్లో స్పిన్ మాయాజాలంతో నలుగురిని పెవిలియన్ పంపాడు. దీంతో సిక్కిం జట్టు 75 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన విదర్భ జట్టు 205 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
కర్నెవార్ ఇప్పటివరకు 44 టీ20లు ఆడాడు. 43 వికెట్లు తీశాడు.
ఇదీ చదవండి: