ETV Bharat / sports

సింధుకు కాబోయేవాడు అలా ఉండాలట! - సింధు కుటుంబం

తనకు కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పేసింది భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధు. మంచి వాడై, తనను అర్థం చేసుకుంటే చాలని తెలిపింది. తన వ్యక్తిగత జీవితం గురించి ఇంకా బోలెడన్ని విశేషాలను పంచుకుందీ ఒలింపిక్ విజేత.

PV Sindhu
వీపీ సింధు
author img

By

Published : Aug 5, 2021, 7:41 AM IST

సింధు పేరు వినగానే తన ఆట, సాధించిన పతకాలే గుర్తొస్తాయి. ఒలింపిక్స్‌లో తాజాగా రెండో పతకంతో అటు తల్లిదండ్రులకీ, దేశానికీ మరోసారి గుర్తింపు తెచ్చింది. ఇదంతా తెలిసిందే! వ్యక్తిగతంగా తన ఇష్టాయిష్టాలు, ఆలోచనలను, లాక్‌డౌన్‌ అనుభవాలను 'ఈనాడు'తో ప్రత్యేకంగా పంచుకుందిలా!

PV Sindhu
సింధు

ఏమవుదామని?: డాక్టరవ్వాలనుకున్నా. అనుకోకుండా బ్యాడ్మింటన్‌లో అడుగుపెట్టినా ఉన్నతస్థాయి క్రీడాకారిణవ్వాలనుకున్నా. ప్రతిక్షణం విజయాలను సాధించాలనే లక్ష్యంతోనే ఉంటా.

ఫ్రెండ్స్‌: స్కూల్లో చాలా తక్కువ. అప్పుడప్పుడు మెసేజ్‌లు పంపినా టోర్నమెంట్స్‌ బిజీ వల్ల కలవడం కుదిరేది కాదు. అమ్మానాన్న, స్క్వాష్‌ ప్లేయర్‌ జ్యోత్స్న నా బెస్ట్‌ ఫ్రెండ్స్‌.

వార్డ్‌రోబ్‌లో: అన్నిరకాలూ ఇష్టమే. అచ్చ తెలుగమ్మాయిలా తయారవడం మరీ ఇష్టం. పండగలు, శుభకార్యాలేవైనా చీర, లంగావోణీకే ప్రాధాన్యం. దుస్తుల సెలక్షన్‌ అంతా అమ్మ, అక్కదే. కానీ నా వార్డ్‌రోబ్‌ నిండా ప్రాక్టీస్‌ దుస్తులే.

PV Sindhu
స్టైల్​గా సింధు

షాపింగ్‌?: వీలు చిక్కేది ప్రయాణాలు, విమానాశ్రయాల్లోనే. ఆ కొద్ది సమయంలోనే అమ్మ, అమ్మమ్మ, అక్క కోసం ఏదైనా కొని సర్‌ప్రైజ్‌ చేస్తా.

వంటా గట్రా!: లాక్‌డౌన్‌లో నేర్చుకున్నా. ఆరుగంటలు ఫిట్‌నెస్‌కు, మిగిలిన సమయంలో వంటింట్లో అమ్మకు సాయం చేస్తూ, వంటలు నేర్చుకుంటూ గడిపేశా. బిర్యానీ, ఆమ్లెట్‌, దోశ, శాండ్‌విచ్‌, ఉప్మా వంటివన్నీ చేస్తా. అంతేకాదు.. టీ కాయడం, పూల మాల కట్టడమూ నేర్చుకున్నా. టేబుల్‌పై అన్నీ సర్దడంలో అమ్మకు సాయం చేయడమూ ఇష్టమే.

ఇష్టంగా తినేవి: షాగౌస్‌ బిర్యానీ లొట్టలేసుకుని తినేస్తా. అమ్మ చేతి చేపలకూరన్నా ప్రాణమే. ఒలింపిక్స్‌కు ముందు మాత్రం అన్నింటినీ త్యాగం చేశా. అమ్మ కొంచెం తిను అన్నా, నాకు నేను విధించుకున్న నియమాలను ఏనాడూ వదల్లేదు. పాలు, పండ్లు, డ్రైప్రూట్స్‌, పండ్ల రసాలు, ఉడికించిన గుడ్లు, కూరగాయల సలాడ్స్‌.. ఇదే నా భోజనం.

PV Sindhu
పీవీ సింధు

కాబోయే వాడిలో..: మంచి మనసుండాలి. నన్ను అర్థం చేసుకుని నన్ను నన్నుగా ప్రేమించే వాడై ఉండాలి. అలాంటి వ్యక్తి ఇంకా ఎదురుపడలేదు. ఎదురైతే చేసుకుంటా.

ఖాళీ దొరికితే: క్రీడా సంబంధిత చిత్రాలు, బయోగ్రఫీలు చూస్తుంటా. మహేశ్‌, ప్రభాస్‌, అనుష్కలకు వీరాభిమానిని. పుస్తకాలు చదివే అలవాటు తక్కువే. ఫాస్ట్‌బీట్‌ మ్యూజిక్‌ అంటే చాలా ఇష్టం. ఇంట్లో, జిమ్‌లో సంగీతం వింటూనే సాధన చేస్తా. కొన్ని హిందీ పాటలకు అద్దంలో చూసుకుంటూ కాలు కూడా కదుపుతా.

అందం: నేనూ అమ్మాయినే కదా! అందంపై శ్రద్ధ చూపిస్తా. నచ్చిన దుస్తులు వేసుకుంటా. ఇవన్నీ ఎలా ఉన్నా.. మనసులోని తృప్తి ముఖానికి మరింత అందం తెస్తుందని నమ్ముతా. అందుకే నాకు నేనెప్పుడూ అందంగానే ఉంటా.

ఓటములు: ఆటలోనైనా, జీవితంలోనైనా గెలుపోటములు సహజం. ఓడిన ప్రతిసారీ బాధపడతా. అలాగని దాన్ని అధిగమించలేకపోతే.. విజేతలం కాలేం. ఊహ తెలిసినప్పటి నుంచి బ్యాడ్మింటనే నా ప్రపంచం. అది మనసుకెంతో తృప్తినిస్తుంది. అమ్మాయిలకీ అదే చెబుతా.. మనసుకి నచ్చిన రంగాన్ని ఎంచుకోమని! అప్పుడే అనుకున్నది సాధిస్తారు. నా లక్ష్యం 2024 ఒలింపిక్స్‌లో బంగారు పతకం.

PV Sindhu
తల్లి విజయ, పీవీ సింధు

విజయం వెనుక: అమ్మానాన్నల త్యాగాలే నా విజయానికి పునాదులు. క్రీడాకారులుగా గెలుపోటములు వాళ్లకు తెలుసు. నేను ఓటమిని ఎదుర్కోవడానికి తగిన శక్తిని అందించి స్ఫూర్తిని నింపేది వారే.

ఇది నా పుట్టినరోజు కానుక
- విజయ, సింధు తల్లి

సింధుకు ఎనిమిదేళ్ల వయసులో అనుకుంటా. ఓసారి కారులో వెళుతున్నప్పుడు వాళ్ల నాన్న గుర్తింపు కార్డును తీసుకుని అందులో ఆయన పేరున్న చోటులో తనది రాసుకుని, 'ఐ వాంట్‌ టూ బికమ్‌ యాన్‌ అథ్లెట్‌' అని రాసింది. అది చూసి అందరం నవ్వుకున్నాం. అయితే అప్పటికే తన లక్ష్యాన్ని ఫిక్స్‌ చేసుకుందని ఆ తర్వాత తెలుసుకున్నాం. అండర్‌-13 ఆడేటప్పుడు ఓడిపోతే ఏడ్చేది. ఇప్పుడు తనలో చాలా పరిణతి కనిపిస్తోంది. ఒత్తిడిని ఎలా జయించాలో నేర్చుకుంది. తనకు కుటుంబమంటే ప్రాణం. వాళ్ల అమ్మమ్మ అంటే మరీ ఇష్టం. ఆవిడ దీవెనలు చిన్నప్పటి నుంచి సింధుకు ఓ సెంటిమెంట్‌. సింధు.. తన కోసం మేం త్యాగాలు చేశామని చెబుతుంది. కానీ నా కూతురు సాధించిన విజయాలు మేం పడ్డ కష్టాల్ని మరిచిపోయేలా చేశాయి. ఆగస్టు 25న నా పుట్టినరోజు. గతంలో అదే తేదీన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలిచి, పతకాన్ని పుట్టినరోజు కానుకగా ఇచ్చింది మా బంగారుతల్లి. ఇప్పుడీ పతకాన్ని తెచ్చింది.

PV Sindhu
తల్లితో సింధు

ఇదీ చూడండి: సింధు గొప్ప మనసు.. ఓడించిన తై జూకు ఓదార్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.