ETV Bharat / sitara

విలన్​గా నటించడానికి రెడీ: హీరో బాలకృష్ణ - Akhanda team in Unstoppable with NBK

Akhanda team in Unstoppable with NBK: అగ్ర కథానాయకుడు బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. విలన్​ పాత్రలు చేయడానికి సిద్ధమని అన్నారు. కానీ ఓ కండిషన్ పెట్టారు. ఇంతకీ ఆ కండిషన్ ఏంటంటే?

balakrishna
బాలకృష్ణ
author img

By

Published : Dec 6, 2021, 12:29 PM IST

Updated : Dec 6, 2021, 12:58 PM IST

Unstoppable with NBK latest promo: ఎవరైనా సిద్ధంగా ఉంటే తాను విలన్​గా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. అయితే ఆ సినిమాలో హీరోగా కూడా తానే చేస్తానని చెప్పారు. ఆహా వేదికగా ప్రసారమవుతున్న 'అన్​స్టాపబుల్​ విత్​ ఎన్​బీకే' కొత్త ఎపిసోడ్​కు సంబంధించిన ప్రోమో సోమవారం విడుదలైంది. ఈ ఎపిసోడ్​కు 'అఖండ' చిత్రబృందం విచ్చేసి సందడి చేసింది. ఇందులో భాగంగానే ఈ విషయాన్ని చెప్పారు బాలయ్య.
ఈ షోలో నటుడు శ్రీకాంత్​తో కలిసి బాలయ్య చెప్పిన సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వీరిద్దరూ కలిసి 'అఖండ'లోని తమ డైలాగ్​లు చెబుతూ మరోసారి సరదాగా తలపడ్డారు.

బోయపాటిని కూడా సరదాగా ఆట పట్టించారు బాలయ్య. వీరి సంభాషణలు నవ్వులు పూయించాయి. ఈ క్రమంలోనే.. 'మీరు ప్రపంచానికి ప్రశ్న ఏమో నాకు మాత్రం సమాధానం' అంటూ దర్శకుడు బోయపాటి శ్రీను.. బాలయ్యతో ఉన్న అనుబంధం గురించి చెప్పారు.

akhanda movie
అన్​స్టాపబుల్​ షోలో అఖండ టీమ్

హీరోయిన్​ ప్రగ్యా జైశ్వాల్​, సంగీత దర్శకుడు తమన్​తో కలిసి సరదా ఆటలు ఆడారు బాలయ్య. ఇందులో భాగంగా ఓ గ్లాస్​లోకి తమన్​ బంతిని విసరగా అది కాస్తా ప్రగ్యా పక్కకి పడింది. అప్పుడు.. 'ఏంటి బంతిని గ్లాస్​లోకి వేశావా అమ్మాయి మీదకి వేశావా? పాట నీదేమో పాప మాత్రం నాది' అంటూ బాలయ్య చెప్పిన సరదా డైలాగ్​ ప్రేక్షకులను తెగ నవ్వించింది. ఈ క్రమంలోనే ప్రగ్యాతో కలిసి మరోసారి 'జై బాలయ్య' సాంగ్​కు స్టెప్పులు కూడా వేశారు.

ఇక అఖండ సినిమా విషయానికొస్తే.. ఇటీవలే విడుదలైన ఈ చిత్రానికి భారీ రెస్పాన్స్​ వస్తోంది. ఇందులో బాలయ్య నటన, గెటప్​, బ్యాక్​ గ్రౌండ్​ మ్యూజిక్​ హైలైట్​గా నిలిచాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్​లోనూ బాక్సాఫీస్​ను షేక్​ చేస్తోందీ మూవీ.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇదీ చూడండి: Akhanda Movie: 'అఖండ' జోరు.. బాక్సాఫీసుకు ఊపు

Last Updated : Dec 6, 2021, 12:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.