ప్రముఖ హిందీ బుల్లితెర నటి సెజల్ శర్మ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 'దిల్ తో హ్యాపీ హై జీ' షోతో గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. శుక్రవారం రాత్రి ముంబయిలోని తన నివాసంలో సుసైడ్ చేసుకుంది. ఈ విషయాన్ని సహా నటుడు అరు వర్మ వెల్లడించాడు.
"అవును సెజల్ ఆత్మహత్య చేసుకుంది. ఈ చేదు నిజాన్ని నమ్మలేకపోతున్నా. పదిరోజుల కిత్రమే తనను కలిశాను. అప్పుడు చాలా సంతోషంగా ఉంది. గత ఆదివారం మేం వాట్సాప్‌లో చాటింగ్ కూడా చేసుకున్నాం. కానీ నిన్న(శుక్రవారం) రాత్రి ఆమె సుసైడ్ చేసుకుంది. ఈ విషయం వారి కుటుంబానికి తెలియజేశాం. తన భౌతికకాయాన్ని అంత్యక్రియల కోసం ఉదయ్‌పుర్ తీసుకెళ్లారు" -ఆరు శర్మ, నటుడు
పోలీసులు ఆమె శవం దగ్గర సుసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. వ్యక్తిగత కారణాలతోనే చనిపోతున్నట్లు అందులో ఆమె రాసినట్లు పేర్కొన్నారు. మీరా రోడ్ పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
2017లో ముంబయి వచ్చిన సెజల్.. పలు వాణిజ్య ప్రకటనల్లో నటించింది. ఆ తర్వాత 'దిల్ తో హ్యపీ హై జీ'షోలో అవకాశం తెచ్చుకుని నటిగా మెప్పించింది. 'అజాద్ పరీందే' అనే వెబ్ సిరీస్‌లోనూ కీలక పాత్రలో కనిపించింది.