ETV Bharat / sitara

అన్నతో రోజూ కొట్లాటే: మెగాడాటర్ నిహారిక - niharika varuntej

మెగాడాటర్ నిహారిక బోలెడు సంగతులు చెప్పింది. 'ఆలీతో సరదాగా' షోలో తెగ అల్లరి చేసింది. ఇంతకీ ఏమేం చెప్పిందంటే?

niharika varuntej
నిహారిక వరుణ్​తేజ్
author img

By

Published : Nov 16, 2021, 3:16 PM IST

నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం నిర్మాతగా 'ఒక చిన్న ఫ్యామిలీ'తో ప్రేక్షకుల ముందుకొస్తున్న మెగాడాటర్ నిహారిక.. 'ఆలీతో సరదాగా' టాక్​ షోలో సందడి చేసింది. చిన్ననాటి జ్ఞాపకాల్ని, ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది.

చిన్నప్పుడు ఏమవుదామనుకున్నావ్ అని నిహారికను అలీ అడగ్గా.. 'అప్పట్లో టీచర్ అవుదామనుకున్నా. ఏడో క్లాస్​లో ఉన్నప్పుడు డాక్టర్​ అవుదామనుకున్నాను. కానీ ఇంటర్​మీడియా ఏ గ్రూప్​ తీసుకోవాలని అని అన్నప్పుడు బైపీసీ తీద్దామనుకున్నా. కానీ అందులో ఫిజిక్స్ ఉందని తెలిసి ఆ ఆలోచన మార్చుకున్నాను' అని నిహారిక చెప్పింది.

niharika in ali tho saradaga
మెగా కజిన్స్​తో నిహారిక

నాన్న నిన్ను ఏమని పిలుస్తారు అని అలీ అడగ్గా.. 'మమ్మీ' అని నిహారిక సమాధానమిచ్చింది. అన్న వరుణ్​తేజ్​.. మాములుగా అయితే నిహా, ముద్దొస్తే బంగారం.. బాగా ముద్దొస్తే పంది అని పిలుస్తాడని నవ్వుతూ చెప్పింది.

నాన్న తనను ఒక్కసారి కొట్టారని నిహారిక చెప్పింది. చిన్నప్పుడు రోజూ ఇంట్లో మంచంపై అన్నతో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఫైటింగ్ చేసేదానని అని ఆనాటి సంగతుల్ని గుర్తుచేసుకుంది.

niharika in ali tho saradaga
నాగబాబు ఫ్యామిలీ

చిరంజీవి-నాగబాబు-పవన్​కల్యాణ్​లో ఎవరు ఎక్కువ ఇష్టం? అని అలీ అడగ్గా.. 'అఫ్​కోర్స్ మా నాన్న' నిహారిక సమాధానమిచ్చింది. తాను, సాయిధరమ్ తేజ్, చిన్నత్త, నాన్న.. తమ నలుగురికి కొంచెం మెంటల్​ అంటూ నిహారిక నవ్వుతూ చెప్పింది. అలానే యాంకర్, యూట్యూబర్ నిఖిల్​ విజయేంద్ర కూడా షోకు వచ్చి, నిహారికతో కలిసి అల్లరి చేశాడు.

'ఒక మనసు' సినిమాతో హీరోయిన్​గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక.. ఆ తర్వాత తెలుగులో హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం చిత్రాల్లో నటించింది. చిరు 'సైరా నరసింహారెడ్డి'లో చిన్న పాత్రలో తళుక్కన మెరిసింది. తమిళంలోనూ 'ఒరు నల్ల నాళ్ పాతు సొల్రెన్' సినిమాలో కథానాయికగా కనిపించింది. గతేడాది డిసెంబరులో చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకుంది.

niharika in ali tho saradaga
భర్త చైతన్యతో నిహారిక

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.