ఈ మధ్య కాలంలో యూట్యూబ్‌లో 'హోమ్‌టూర్' వీడియోలు ఎక్కువయ్యాయి. చిన్నచితకా సెలబ్రిటీలు అందరూ తమ ఇంటిని వీడియోగా తీసి యూట్యూబ్‌లో పెడుతున్నారు. ఇప్పుడు ఈ తరహా వీడియోలపై సెటైర్లు వేస్తూ 'జబర్దస్త్'లో రాకెట్ రాఘవ చేసిన స్కిట్ తెగ నవ్విస్తోంది. అందుకు సంబంధించిన ప్రోమో విడుదలవగా, దానికి విశేష స్పందన వస్తోంది.
![mano jabardast](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12825526_jabardast-1.png)
జడ్జి మనోతో కలిసి స్కిట్ చేసిన హైపర్ ఆది, తనదైన శైలి పంచులతో అలరించారు. 'మారి' గెటప్‌లో వచ్చిన చలాకీ చంటి, తన హావభావాలతో మెప్పించారు. 'ఆషాడమాసం' కొత్త పెళ్లికొడుకులు స్కిట్‌తో వెంకీ మంకీస్ టీమ్ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.
ఎవరి పెళ్లికి అయినా సరే బంధువుల్ని అద్దెకిస్తామంటూ అదిరే అభి చేసిన స్కిట్ ఆలోచింపజేస్తూ, నవ్విస్తోంది. ఇలా సందడి సందడిగా సాగిన ఈ ఎపిసోడ్‌ను చూడాలంటే ఆగస్టు 26 రాత్రి 9:30 గంటల వరకు ఆగాల్సిందే.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇవీ చదవండి: