ETV Bharat / sitara

Etv dasara event 2021: ఈటీవీ దసరా ఈవెంట్.. దద్దరిల్లిపోయే రేంజ్​లో! - ఈటీవీ దసరా ప్రోగ్రాం లేటెస్ట్ ప్రోమో

దసరాకు ఈసారి ఈటీవీ గట్టిగా ప్లాన్ చేసింది. ప్రేక్షకుల్ని టీవీలకు కట్టిపడేసేలా ప్రోగ్రాంను రూపొందించింది. అక్టోబరు 15 ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఈ ఈవెంట్​ కొత్త ప్రోమో అలరిస్తూ, ఎపిసోడ్​పై అంచనాల్ని పెంచేస్తోంది.

Etv dasara event 2021
ఈటీవీ దసరా ప్రోగ్రాం
author img

By

Published : Oct 13, 2021, 3:57 PM IST

దసరా పండక్కి ఈసారి ఈటీవీలో ప్రోగ్రాం(etv dasara event 2021) అదిరిపోయే రేంజ్​లో ప్లాన్ చేశారు. ప్రోమోలు చూస్తే చాలు ఇది అర్ధమైపోతుంది. బుధవారం వచ్చిన కొత్త ప్రోమో(etv dasara programme promo) అందుకు ఏమాత్రం తీసిపోవట్లేదు. ఇందులోనూ రకరకాల స్కిట్​లు, డ్యాన్స్​లు చేసి, టీవీ ప్రేక్షకుల్ని రంజింపజేస్తున్నారు.

ఈటీవీ దసరా ప్రోగ్రాం
వర్ష - ఇమ్మాన్యుయేల్

'మాయాబజార్​'ను(mayabazar movie) ఈసారి దసరా ప్రోగ్రాం కోసం రీక్రియేట్​ చేశారు. గెటప్​ శ్రీను కృష్ణుడిగా, శేఖర్ మాస్టర్ అభిమన్యుడిగా, రోజా శశిరేఖగా, శకునిగా హైపర్ ఆది(hyper aadi jabardasth), కౌరవులుగా ఆటో రాంప్రసాద్ టీమ్, ఘటోత్కచుడిగా బుల్లెట్ భాస్కర్ కనిపించనున్నారు. వీరందరూ కలిసి చేసిన స్కిట్​ ఆకట్టుకుంటోంది.

ఇమ్మాన్యుయేల్-వర్ష(varsha jabardasth) గొడవపడి.. రోజా దగ్గరకు వచ్చారు. ఆమె ఏం పరిష్కారం చెప్పిందో తెలియాలంటే ఎపిసోడ్​ ప్రసారమయ్యే వరకు ఆగాల్సిందే.

శేఖర్ మాస్టర్-రోజాపై(roja jabardasth news) పంచులు వేసిన యాంకర్ ప్రదీప్.. తెగ నవ్వించాడు. ఆడపిల్లలపై ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అఘాయిత్యాల గురించి చెబుతూ చేసిన మరో డ్యాన్స్​ ప్రదర్శన అక్కడున్న అందరితో కన్నీరు పెట్టించింది.

ఈటీవీ దసరా ప్రోగ్రాం
డ్యాన్స్

చివర్లో దసరా సందర్భంగా అమ్మోరు గెటప్ వేసిన రోజా.. డ్యాన్స్​ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. ఈమెతో పాటు పలువురు జబర్దస్త్ కమెడీయన్లు కూడా ఈ నృత్య ప్రదర్శనలో భాగమయ్యారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.