ETV Bharat / sitara

అగ్గిబరాటాల కథతో.. ఆస్కార్‌కు! - రైటింగ్​ విత్​ ఫైర్​ సినిమా ఆస్కార్​

Writing with Fire documentary: ఆరున్నర షో కోసమని హడావుడిగా థియేటర్‌కి వెళ్లి... అభిమాన హీరో తెరపైకి వస్తాడని కళ్లప్పగించి చూస్తుంటే... సరిగ్గా 6.35కి ‘ప్రధాని రష్యా పర్యటన’ అన్న టైటిల్‌ పడుతుంది! దాని తాలూకు న్యూస్‌రీల్‌ డాక్యుమెంటరీ సగటు అభిమాని సహనానికి పరీక్ష పెడుతుంది. ఇలాంటి అనుభవాలవల్లనేమో మనకి డాక్యుమెంటరీలపైన సదభిప్రాయం లేదు. ఆ భావాల్ని తుడిచిపెట్టేయమంటోంది ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’. ఈ ఏడాది ఆస్కార్‌ బరిలో సత్తా చాటుతున్న కొత్తతరం డాక్యుమెంటరీ ఇది. ఉత్కంఠలో ఏ సినిమాకీ తీసిపోని దాని నేపథ్యం ఇది...

రైటింగ్​ విత్​ ఫైర్​, writing with fire
రైటింగ్​ విత్​ ఫైర్​
author img

By

Published : Jan 2, 2022, 6:42 AM IST

Writing with Fire documentary: రింటూ థామస్‌, సుస్మిత్‌ ఘోష్‌... ఆలూమగలు. గత పదేళ్లుగా మహిళా సాధికారతా, పర్యావరణాలపైన డాక్యుమెంటరీలు తీస్తున్నారు. వాటిని సినిమాలకి దీటుగా... ఆకర్షణీయంగా తీయొచ్చని నిరూపిస్తున్నారు. ఇద్దరూ కలిసి చేసిన ‘టింబక్టు’ అన్న డాక్యుమెంటరీకి జాతీయ అవార్డూ వచ్చింది. తర్వాతి ప్రాజెక్టు ఏంటని ఆలోచిస్తుండగానే ఇంగ్లిషు పత్రికలో వచ్చిన ఓ ఫొటో ఆకర్షించింది. ఓ మహిళ తన చేతిలో ‘ఖబర్‌ లహరియా’ అన్న హిందీ పత్రికల కట్టని పట్టుకుని వీధుల్లో నడుస్తున్న చిత్రం అది. దానికింద ‘ఖబర్‌ లహరియా’... బుందేల్‌ఖండ్‌ ప్రాంతంలో గ్రామీణ మహిళలే నడుపుతున్న పత్రిక. ఇందులో వాళ్లే విలేకర్లూ, ఎడిటర్లూ, పబ్లిషర్లూ... పదిహేనేళ్లుగా ఈ పత్రిక నడుస్తోంది!’ అని రాసి ఉందట. ఆ పత్రిక గురించి డాక్యుమెంటరీ తీయాలని వాళ్ల కాంటాక్ట్‌ సంపాదించారు దంపతులిద్దరూ. అటువైపు నుంచి అక్కడి సీనియర్‌ జర్నలిస్టు మీరా మాట్లాడారు. మాటల్లో తమ పత్రిక తొలిసారి ఫేస్‌బుక్‌ ద్వారా డిజిటల్‌గా రాబోతోందని చెప్పారట మీరా. ‘ఈ విలేకర్లలో 90 శాతం వరకూ పెద్దగా చదువుకోనివాళ్లని తెలిసింది. అసలు బడికే వెళ్లనివాళ్లూ ఉన్నారు. అలాంటివాళ్లు తొలిసారి డిజిటల్‌ జర్నలిజంవైపు ఎలా రాగలరు... అది సాధ్యమేనా? ఆ సాధ్యాసాధ్యాలనే డాక్యుమెంటరీగా తీస్తే ఎలా ఉంటుంది?’ అన్న ఆలోచనతో వెంటనే బయల్దేరి బుందేల్‌ఖండ్‌ వెళ్లిపోయారు.

మాఫియా పడగ నీడన...

మధ్యప్రదేశ్‌-ఉత్తరప్రదేశ్‌ మధ్య ఉన్న ఓ నాలుగైదు జిల్లాలని బుందేల్‌ఖండ్‌ ప్రాంతం అని పిలుస్తుంటారు. వాటిల్లో చిత్రకూట్‌ జిల్లా ఒకటి. అక్కడి మారుమూల పల్లెల నుంచే ‘ఖబర్‌ లహరియా’ వస్తుంటుంది. దాదాపు 30 మంది విలేకర్లున్నారు... వీరిలో ఎక్కువమంది దళితులూ, గిరిజనులూ, ముస్లిములూ. వీళ్లు పనిచేసే ప్రాంతంలో మైనింగ్‌ మాఫియా ఆగడాలు ఎక్కువ. అడ్డొచ్చిన వాళ్లని నిర్దాక్షిణ్యంగా చంపడం, రాత్రుళ్లు ఇళ్లలోకి చొరబడి అత్యాచారాలకి పాల్పడటం, వాళ్లకి పోలీసులు వంతపాడటం ఈ ప్రాంతంలో మామూలు. అక్కడి బాధితుల గోడుని ధైర్యంగా ప్రపంచానికి చాటుతుంది ‘ఖబర్‌ లహరియా’. అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగడుతుంది. కానీ... అసలే స్త్రీలు, ఆపైన అణగారినవర్గాలకి చెందినవాళ్లు కావడంతో ఇంటాబయటా వీరిపైన వివక్ష ఉంటూనే ఉంటుంది. ‘అలాంటివాళ్లకి ‘డిజిటల్‌ మీడియా’ అన్నది ఏ రకంగా ఆయుధంగా మారుతుందో మేం చెప్పాలనుకున్నాం. వీళ్లలో చాలామంది స్మార్ట్‌ఫోన్‌లని చూడటం అదే తొలిసారి. కొందరికైతే ఏబీసీడీలూ రావు. అలాంటివాళ్లు హిందీ సాయంతో ఇంగ్లిషు అభ్యసించడాన్నీ, అతికష్టంపైన వీడియో రికార్డింగ్‌ ఎడిటింగ్‌ అప్‌లºడింగ్‌ వంటివాటిని నేర్చుకోవడాన్నే... మేం డాక్యుమెంటరీ తీశాం!’ అంటున్నారు రింటూ, సుస్మిత్‌ దంపతులు. ఈ డాక్యు మెంటరీ కోసం 2016లో అలా వెళ్లినవాళ్లు... ఐదేళ్లపాటు అక్కడే ఉండిపోయారు. 45 డిగ్రీల ఎండనీ... రెండు డిగ్రీల చలినీ లెక్కచేయలేదు.

అవి అదిరిపోతాయి...

అత్యాచారానికి గురైన మహిళ ఇంటికి వెళ్లిన విలేకరి మీరాని బాధితురాలి భర్త ‘నాకు నువ్వే న్యాయంచేయగలవన్న నమ్మకం ఉంది తల్లీ!’ అంటూ ఏడవడం, ఈ కేసుపైన ఆధారాల్ని దాస్తున్న పోలీసుల్ని ఆమె ధైర్యంగా నిలదీస్తూ ఉండటం, మరో విలేకరి సునీత మైనింగ్‌ మాఫియా వద్దకి ఒంటరిగా స్పై కెమెరాతో వెళ్లడం, ఆమెని ‘ఆడదానిలా హద్దుల్లో ఉండి మాట్లాడు... జాగ్రత్త!’ అంటూ రాజకీయనాయకుడు బెదిరించడం, విలేకరిగా డ్యూటీ ముగించి ఇంటికొచ్చిన మీరాని వాళ్లాయన ‘నువ్వు ఈ ఉద్యోగం ఎప్పుడు మానేస్తావ్‌...?’ అని అడగడం... వంటి దృశ్యాల్ని సినిమాలకన్నా అద్భుతంగా చిత్రీకరించారు దర్శకులిద్దరూ! అందుకే ఈ డాక్యుమెంటరీ చిత్రం ఆస్కార్‌కి వెళ్లడానికి ముందే ప్రపంచవ్యాప్త మన్ననలు అందుకుంది. 40 పైచిలుకు అంతర్జాతీయ అవార్డులు చేజిక్కించుకుంది. ఆ ఊపులోనే ఆస్కార్‌ బరిలోకి దిగింది. మనదేశం నుంచి వెళ్లిన సినిమాలన్నీ పోటీనుంచి తప్పుకున్నా... 138 చిత్రాలని దాటి చివరి జాబితాలో చోటు సాధించింది! ఈ చిత్రం గురించి వాషింగ్టన్‌ పోస్ట్‌ వంటి ప్రముఖ పత్రికలు ‘ఇది జర్నలిజంపైన వచ్చిన అత్యంత స్ఫూర్తిమంతమైన చిత్రంగా నిలిచిపోతుంది... ఎప్పటికీ...!’ అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నాయంటే చూసుకోండి మరి!

ఇదీ చూడండి: బాలయ్యతో భళ్లాలదేవ.. 'ఆహాలో' దబిడి దిబిడే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.