ETV Bharat / sitara

''రామాయణ్​' మళ్లీ హిట్​ కావడానికి కారణమదే'

author img

By

Published : May 2, 2020, 11:53 AM IST

'రామాయణ్' ప్రపంచ రికార్డు సాధించడం, తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు సీత పాత్రధారి దీపిక. అప్పట్లో నమోదైన మ్యాజిక్​ వల్లే, సీరియల్ మరోసారి ప్రేక్షకాదరణ పొందుతోందని అభిప్రాయపడ్డారు.

What is the reason behind smashing success of Ramayan? Dipika Chikhalia answers
రామాయణ్​ విజయమవ్వడానికి కారణమదేనా?

దూరదర్శన్​ ఛానెల్​లో మూడు దశాబ్దాల తర్వాత పునఃప్రసారమవుతున్న 'రామాయణ్'.. ప్రపంచంలో అత్యధికులు చూసిన పౌరాణిక సీరియల్​గా రికార్డు సృష్టించింది. ఈ విషయమై స్పందించిన సీత పాత్రధారి దీపిక చిఖాలియా... ఈ ధారావాహిక మరోసారి ప్రేక్షకాదరణ పొందడంపై హర్షం వ్యక్తం చేశారు. 30 ఏళ్ల క్రితమే నమోదైన మ్యాజిక్ వల్ల ఇది సాధ్యమైందని అన్నారు. వీటితో పాటే పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

"ప్రపంచంలో ఎక్కువ మంది చూసిన 'గేమ్​​ ఆఫ్స్​ థ్రోన్స్' వెబ్​సిరీస్​​ను 'రామాయణ్'​ అధిగమించడం చాలా సంతోషంగా ఉంది. ఇది ఎంతో గొప్ప విషయం. మంచి కథ, దాని వెనకున్న నేపథ్యం వల్లనే ఈ విజయం సాధ్యమైందని అనుకుంటున్నా. ఎప్పటికప్పుడు ఈ ధారావాహిక ఓ కొత్త శకాన్ని ప్రారంభిస్తుంది. సీత పాత్ర కోసం నా కళ్లతో చక్కటి హావభావాలు పలికించాను. ఇప్పుడు నా నటనను మళ్లీ చూసుకున్నప్పుడు ఎంతో ముచ్చటేసింది. కథనం, దర్శకత్వం, నటుల ప్రదర్శన అన్నీ ఈ విజయానికి దోహదపడ్డాయి"

-దీపిక చిఖాలియా, 'రామాయణ్'లో సీత పాత్రధారి

గతనెల 16న ప్రసారమైన 'రామాయణ్' ఎపిసోడ్​తో 7.7 కోట్ల వీక్షణలు సాధించింది. ఈ క్రమంలోనే ప్రపంచంలో అత్యధికులు వీక్షించిన టీవీషోగా నిలిచింది. ఈ విషయాన్ని డీడీ నేషనల్​ తన ట్విట్టర్​ ద్వారా పంచుకుంది.

ఇది చదవండి: 'రామాయణ్' సీరియల్ ప్రపంచ రికార్డు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.