ETV Bharat / sitara

మహేశ్​ బాబుకు పోటీగా విజయ్ దేవరకొండ! - విజయ్​ దేవరకొండ లైగర్​ సినిమా

Mahesh babu vs vijay devarakonda: సూపర్​స్టార్​ మహేశ్​బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' వచ్చే ఏడాది ఏప్రిల్​ 1న విడుదల కానుంది. ఇప్పడదే రోజున విజయ్​ దేవరకొండ నటిస్తున్న 'లైగర్'​ను రిలీజ్​ చేయాలని చిత్రబృందం భావిస్తోందట!

సర్కారు వారి పాట వర్సెస్​ లైగర్​, sarkaru vaari paata vs liger, maheshbabu vs vijay devarkonda
మహేశ్​ 'సర్కారు వారి పాట'తో విజయ్​ 'లైగర్​' పోటీ?
author img

By

Published : Nov 30, 2021, 5:45 AM IST

mahesh babu vs vijay devarakonda: సూపర్​స్టార్​ మహేశ్​బాబు-రౌడీహీరో విజయ్​ దేవరకొండ బాక్సాఫీస్​ వద్ద తలపడనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పూరీజగన్నాథ్​ దర్శకత్వంలో విజయ్​ నటిస్తున్న సినిమా 'లైగర్​'(vijaydevarkonda liger movie). ఇటీవలే అమెరికాలో ఓ కీలక షెడ్యూల్ షూటింగ్​ను​ పూర్తిచేసుకుంది. ఈ చిత్రం రిలీజ్​ ఎప్పుడా? అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీని ఏప్రిల్​ 1న విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోందట. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.

కాగా, ఇప్పటికే మహేశ్​బాబు నటించిన 'సర్కారు వారి పాట' అదే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఒకవేళ లైగర్​ రిలీజ్​ డేట్​ పక్కా అయితే.. బాక్సాఫీస్​ పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి. కాగా, లైగర్​ చిత్రబృందం నిర్ణయంతో మహేశ్​ సినిమా విడుదల తేదీని మళ్లీ మార్చుకుని మార్చిలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని టాక్​. ఏదేమైనా దీనిపై క్లారిటీ రావాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

బ్యాంక్​ రుణాల ఎగవేత నేపథ్య కథతో సర్కారు వారి పాట తెరకెక్కింది(mahesh sarkaru vaari paata movie). ఇందులో మహేశ్​కు జోడీగా కీర్తి సురేశ్​ నటిస్తోంది. తమన్ సంగీతమందిస్తుండగా, పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్​తో నిర్మిస్తోంది. ఇక, లైగర్​ విషయానికొస్తే.. బాక్సింగ్ నేపథ్య కథతో రూపొందుతోంది. ఇందులో విజయ్ బాక్సర్​గా నటిస్తున్నాడు. అనన్యా పాండే హీరోయిన్. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు.

సర్కారు వారి పాట వర్సెస్​ లైగర్​, sarkaru vaari paata vs liger, maheshbabu vs vijay devarkonda
లైగర్​

ఇదీ చూడండి: ప్రభాస్​ 'రాధేశ్యామ్'​ సెకండ్ సాంగ్​ టీజర్​ వచ్చేసింది​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.