తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన 'బిచ్చగాడు'.. నటుడు విజయ్ ఆంటోనికి గుర్తింపు తీసుకొచ్చింది. 2016లో ప్రేక్షకుల ముందుకొచ్చి, ఘనమైన వసూళ్లు సాధించిందీ చిత్రం. ఇప్పుడు ఇదే సినిమాకు త్వరలో సీక్వెల్ తీయనున్నారు. అందుకోసం నటుడు విజయ్‌నే రచయితగా మారారు. ఈ విషయాన్ని తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
"నాలుగు నెలల నుంచి సీక్వెల్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసే పనిలో ఉన్నాను. స్క్రిప్ట్‌కు తుదిమెరుగులు దిద్దుతున్నాం. త్వరలోనే తారాగణంతో పాటు సాంకేతివర్గాన్ని వెల్లడిస్తా"
- విజయ్ ఆంటోని, తమిళ కథానాయకుడు
మాతృకకు దర్శకత్వం వహించిన శశి.. ప్రస్తుతం వేరే చిత్రాలతో బిజీగా ఉన్నారు. దీనితో పాటే సీక్వెల్‌కూ విజయ్ ఆంటోనినే సంగీత దర్శకుడిగా వ్యవహరించనున్నారు. ఇతడు ప్రస్తుతం 'తమీజరాసన్', 'అగ్ని సిరగుగాల్', 'ఖాకీ' చిత్రాలతో పాటు మరో మూడు సినిమాల్లోను నటిస్తున్నాడు.
ఇదీ చూడండి... టాలీవుడ్ దర్శకులకు ఇదో మంచి కథావకాశం