నాగశార్య, రీతూవర్మ జంటగా నటించిన కుటుంబ కథాచిత్రం 'వరుడు కావలెను'(varudu kaavalenu). ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబరు 29న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఈ చిత్ర యూనిట్ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. గురువారం రాత్రి 7 గంటలకు ఈ ప్రచార చిత్రాన్ని నటుడు దగ్గుబాటి రానా రిలీజ్ చేయనున్నారని వెల్లడించింది.
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సోదరుడైన శిరీష్ తనయుడు ఆశీష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'రౌడీబాయ్స్'(rowdy boys movie). 'హుషారు' దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని 'ప్రేమే ఆకాశం' అనే పాటను విడుదల చేసింది చిత్రబృందం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సాంగ్‌ను జస్ప్రీత్ జజ్ ఆలపించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
యువహీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త చిత్రం 'సమ్మతమే'. 'లవ్ ఈజ్ అన్ కండీషనల్' అనే ట్యాగ్‌లైన్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చాందిని చౌదరి హీరోయిన్గా చేస్తోంది. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను గురువారం ఉదయం 10.10 గంటలకు విడుదల చేయనున్నారు.
-
Tomorrow 10:10am #Sammathame #Ugproductions pic.twitter.com/Q0zL8Uspda
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 20, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Tomorrow 10:10am #Sammathame #Ugproductions pic.twitter.com/Q0zL8Uspda
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 20, 2021Tomorrow 10:10am #Sammathame #Ugproductions pic.twitter.com/Q0zL8Uspda
— Kiran Abbavaram (@Kiran_Abbavaram) October 20, 2021
అశోక్ గల్లా, నిధి అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'హీరో'. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోని తొలి సాంగ్‌ను అక్టోబర్ 25న విడుదల చేయనున్నట్లు వెల్లడించింది చిత్రబృందం. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.