ETV Bharat / sitara

సమంత 'యశోద'లో వరలక్ష్మి.. 'లైగర్​' కొత్త అప్డేట్ - ఎటాక్ టీజర్

Cinema news: సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో యశోద, లైగర్, ఎటాక్, గూడుపుఠాణీ, ఓ డామిట్ డేవిడ్​రాజుకి పెళ్లైపోయింది చిత్రాల కొత్త సంగతులు ఉన్నాయి.

samantha vijay devarakonda
సమంత విజయ్ దేవరకొండ
author img

By

Published : Dec 15, 2021, 6:50 PM IST

Samantha Yasodha movie: సమంత చేస్తున్న పాన్ ఇండియా మూవీ 'యశోద'. ఇందులో తమిళ నటి వరలక్ష్మి శరత్​కుమార్.. మధుబాల అనే కీలకపాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. థ్రిల్లర్​ కథతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్​ డిసెంబరు 6న ప్రారంభమైంది.

అయితే వీలైనంత త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి మార్చి కల్లా సినిమా విడుదల చేస్తామని చెబుతున్నారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తుండగా.. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. హరి-హరీశ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

వీటితో పాటు సమంత 'శాకుంతలం', ఇంటర్నేషనల్​ మూవీలో నటిస్తోంది. ఆమె ప్రత్యేక గీతం చేసిన 'పుష్ప' చిత్రం.. డిసెంబరు 17న పాన్ ఇండియా రేంజ్​లో రిలీజ్ కానుంది.

Vijay devarakonda Liger: విజయ్ దేవరకొండ 'లైగర్' సినిమా నుంచి కొత్త అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం 10:03 గంటలకు దీనిని ప్రకటించనున్నట్లు వెల్లడించారు.

బాక్సింగ్ బ్యాక్​డ్రాప్​తో తీస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్​గా చేస్తోంది. దిగ్గజ బాక్సర్ మైక్ టైసన్ కీలకపాత్ర పోషిస్తున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ, ఛార్మీతో కలిసి సినిమాను నిర్మిస్తున్నారు.

Attack teaser: జాన్ అబ్రహం 'ఎటాక్' టీజర్ రిలీజైంది. యాక్షన్ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ సినిమా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ నేపథ్యంగా తీశారు. ఈ టెక్నాలజీ ఉపయోగించి భారత సాయుధ దళాలు యుద్ధంలో ఎలా పోరాడాయి? ఇందులో జాన్ అబ్రహం పాత్రేంటి తెలియాలంటే ఈ సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 28న ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఇందులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటించారు. లక్ష్య రాజ్​ ఆనంద్ దర్శకత్వం వహించారు.

*హాస్యనటుడు సప్తగిరి హీరోగా నటించిన 'గూడుపుఠాణి' సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు. డిసెంబరు 25న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. అలానే 'ఓ డామిట్ డేవిడ్​రాజుకి పెళ్లైపోయింది' సినిమా.. బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది.

guduputani movie 2021
సప్తగిరి గూడుపుఠాణి మూవీ
.
.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.