ETV Bharat / sitara

''వకీల్​సాబ్​'తో నా బాధ్యత ఇంకా పెరిగింది' - పవర్​స్టార్ వకీల్​సాబ్

తాజాగా ఓ ఛానెల్​తో మాట్లాడిన సంగీత దర్శకుడు తమన్.. 'వకీల్​సాబ్' విషయంలో తనకు బాధ్యత పెరిగిందన్నారు. పవన్​ క్రేజ్​కు ఏమాత్రం తగ్గకుండా పాటలు ఉంటాయని చెప్పారు.

''వకీల్​సాబ్​'తో నా బాధ్యత పెరిగింది'
సంగీత దర్శకుడు తమన్
author img

By

Published : May 6, 2020, 7:34 PM IST

'వకీల్‌ సాబ్‌' విషయంలో తన బాధ్యత ఎంతగానో పెరిగిందని ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ అన్నారు. 'అజ్ఞాతవాసి' చిత్రం తర్వాత దాదాపు రెండేళ్లు విరామం తీసుకుని, పవన్‌ రీఎంట్రీ ఇస్తున్న చిత్రమిది. హిందీలో మంచి విజయం సాధించిన 'పింక్‌'కు రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. వేసవి కానుకగా మే 11న విడుదల కావాల్సినా.. కరోనా కారణంగా కొంతకాలం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఓ ఛానెల్​తో ప్రత్యేకంగా ముచ్చటించిన తమన్.. 'వకీల్ సాబ్‌' విశేషాలు పంచుకున్నారు.

VAKEELSAAB POSTER
వకీల్​సాబ్ పోస్టర్

'రాజకీయలపై దృష్టి సారించి దాదాపు రెండేళ్లపాటు సినిమాల నుంచి విరామం తీసుకుని పవన్‌కల్యాణ్‌ వెండితెరపై సందడి చేయనున్న 'వకీల్‌ సాబ్‌' విషయంలో సినీ ప్రియుల్లో ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఆయనకు ఉన్న క్రేజ్ దృష్ట్యా, కథపరంగా.. సంగీతం విషయంలో నాకెంతో బాధ్యత పెరిగింది. ఒక అభిమానిగా ఆయనతో కలిసి పనిచేస్తున్న మొదటి చిత్రమిది. పవర్​స్టార్ క్రేజ్‌కు ఏ మాత్రం తగ్గకుండా సంగీతం, పాటలు అందించాలనుకున్నాను. అలాగే ఏ గీతం విడుదల చేసినా సరే అదొక మార్క్‌ క్రియేట్‌ చేయాలనుకున్నాను. మేం ఆశించినట్టుగానే మొదటి పాట 'మగువా మగువా' ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. రామజోగయ్య శాస్త్రిగారు మంచి సాహిత్యాన్ని అందించారు. మా దర్శక నిర్మాతలు నాకెంతో సహకరించారు' -తమన్, సంగీత దర్శకుడు

అమితాబ్‌ బచ్చన్‌, తాప్సీ కీలక పాత్రల్లో బాలీవుడ్‌లో తెరకెక్కిన చిత్రం 'పింక్‌'. 2016లో విడుదలై, మంచి విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమాను తమిళంలో అజిత్ ప్రధాన పాత్రలో రీమేక్‌ చేశారు. అయితే 'పింక్‌' తెలుగు రీమేక్‌కు వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌ రాజు నిర్మాత.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.