ETV Bharat / sitara

బాలయ్యతో రవితేజ.. ఈసారి డబుల్ మాస్​ గ్యారెంటీ! - రవితేజ న్యూస్

Unstoppable with NBK: నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న టాక్​ షోలో సందడి చేశారు మాస్​మాహారాజా రవితేజ, దర్శకుడు గోపీచంద్. దీంతో ఈ ఎపిసోడ్ ఎప్పుడు విడుదలవుతుందా? అని అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

unstoppable
అన్​స్టాపబుల్
author img

By

Published : Dec 19, 2021, 11:20 AM IST

Unstoppable with NBK: 'అఖండ' సినిమాతో థియేటర్ల దగ్గర దుమ్ములేపుతున్న బాలయ్య.. ఓటీటీలోనూ అదరగొడుతున్నారు. ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహాలో 'అన్​స్టాపబుల్ విత్ ఎన్​బీకే' టాక్​ షోతో అభిమానుల్ని అలరిస్తున్నారు.

ఇటీవలే దర్శక దిగ్గజం జక్కన్న, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి పాల్గొన్న ఐదో ఎపిసోడ్​ స్ట్రీమింగ్ అవ్వగా.. ఆరో ఎపిసోడ్​ కోసం రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని షూటింగ్​లో పాల్గొన్నారు. ఆదివారం ఈ షూటింగ్​ జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది 'ఆహా'. దీంతో అటు బాలకృష్ణ, ఇటు రవితేజ ఫ్యాన్స్​ పండగ చేసుకుంటున్నారు. డిసెంబర్ 24న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

రవితేజ ప్రస్తుతం 'ఖిలాడి' సినిమాలో నటిస్తున్నారు. రమేష్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యాక్షన్​ థ్రిల్లర్​గా తెరకెక్కనుంది. అలాగే ఇటీవలే 'అఖండ'తో ప్రేక్షకుల మదిదోచిన బాలయ్య.. త్వరలో గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయబోతున్నారు.

ఇదీ చదవండి:

విలన్​గా నటించడానికి రెడీ: హీరో బాలకృష్ణ

బాలయ్యతో సినిమా.. రాజమౌళి ఆన్సర్ ఇదే!

బాలయ్యతో సినిమా.. రాజమౌళి భయం అదే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.