ETV Bharat / sitara

సంక్రాంతి బరి.. ఏ సినిమా గురి?

టాలీవుడ్​కు రికార్డుల సీజన్​గా మారింది సంక్రాంతి. ఈ ముగ్గుల పండగకు సినిమాలు విడుదల చేసేందుకు అగ్రహీరోలు ముందుగానే బెర్త్ ఖరారు చేసుకుంటుంటారు. కానీ ఈ ఏడాది కరోనా వల్ల ఈ సీజన్​లో విడుదలయ్యే చిత్రాలపై అనుమానాలు నెలకొన్నాయి. అయితే ఇప్పటివరకు ఈ సీజన్​ బరిలో ఉన్న చిత్రాలేంటో చూద్దాం.

author img

By

Published : Aug 29, 2020, 7:24 AM IST

సంక్రాంతి బరి.. ఏ సినిమా గురి?
సంక్రాంతి బరి.. ఏ సినిమా గురి?

తెలుగు చిత్రసీమకు ఆయువు పట్టు సంక్రాంతి. అగ్ర హీరోలు మూకుమ్మడిగా వెండితెరపైకి దండయాత్రగా వచ్చేది.. కళ్లు చెదిరే వసూళ్లతో బాక్సాఫీస్‌ ముందు సరికొత్త రికార్డులు సృష్టించేది ఈ సీజన్‌లోనే. అందుకే ముగ్గుల పండగ వస్తుందంటే చాలు.. దాదాపు ఆర్నెళ్ల ముందు నుంచే సంక్రాంతి అల్లుళ్లగా మారేందుకు సెట్స్‌పై ముస్తాబవుతుంటారు అగ్ర హీరోలు. ఇది ఏటా ఉన్న ఆనవాయితీనే. ఇప్పుడీ ఆనవాయితీకి కరోనా రూపంలో చెక్‌ పడినట్లయింది. చిత్రీకరణలు ఆలస్యమవడం వల్ల.. పెద్ద పండక్కి వస్తారనుకున్న అగ్ర హీరోలంతా వేసవి వైపు దృష్టిసారించారు. దీంతో ఈసారి సంక్రాంతి బరిలో నిలిచేదెవరన్నది ఆసక్తికరంగా మారింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూసే సినీ సంక్రాంతికి నాలుగున్నర నెలల సమయమే ఉంది. కరోనాతో ఈసారి చిత్ర సీమలో పండగ సందడి కనిపించడం లేదు. ఓ వైపు చిత్రీకరణలకు అనుమతులిచ్చినా.. కరోనా పరిస్థితులు కుదుటపడకపోవడం వల్ల అగ్ర హీరోలు సెట్స్‌లోకి అడుగుపెట్టడానికి మరింత సమయం పట్టేలా కనిపిస్తోంది. థియేటర్లు తెరవడంపై ఇప్పటికీ సందిగ్ధత కొనసాగుతుండటం, ఒకవేళ ప్రదర్శనలకు అనుమతులిచ్చినా ప్రేక్షకులు మునుపటిలా థియేటర్లకి అలవాటు పడటానికి కాస్త సమయం పట్టే అవకాశాలున్నాయి. ఇప్పుడుఇలాంటి అంశాలన్నీ సంక్రాంతి సీజన్‌పై ప్రభావం చూపిస్తున్నాయి.

వాస్తవానికి దర్శకుడు రాజమౌళి తన 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం కోసం అందరి కంటే ముందుగానే సంక్రాంతి బెర్తును బుక్‌ చేసుకున్నారు. మహమ్మారి వైరస్‌.. జక్కన్న ఆశలపై నీళ్లు జల్లింది. ఇప్పటికిప్పుడు చిత్రీకరణ మొదలుపెట్టినా.. అన్ని పనులు పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేయడానికి కనీసం ఆరు నెలల సమయమైనా పట్టొచ్చని ఇటీవలే రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. దీన్ని బట్టీ చూస్తే ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు పండగ బరి నుంచి తప్పుకొన్నట్లే అని అర్థమవుతోంది. 'ఆచార్య'గా చిరంజీవి, 'అణ్ణాత్త'తో రజనీకాంత్‌ ముగ్గుల పండగ రేసులో తలపడతారని భావించినప్పటికీ.. ఆ చిత్రాలూ వేసవి వైపే దృష్టి సారించాయి. ఇక పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న 'వకీల్‌సాబ్‌' తుదిదశ చిత్రీకరణకు చేరుకున్నప్పటికీ.. ఈ సినిమా తిరిగి సెట్స్‌పైకి వెళ్లడానికి మరింత సమయమే పట్టే అవకాశాలున్నాయి. దీంతో పవన్‌ సంక్రాంతి బరిలో నిలుస్తారా? లేదా? అన్నది అనుమానమే.

వీళ్లూ వస్తే... మరింత రంజుగా రేసు

పెద్ద పండగ రేసులో ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న సినిమాలతో పాటు ఇప్పటికే పూర్తయినవి పోటీ పడే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకొని సిద్ధంగా ఉన్న వాటిలో రానా 'అరణ్య', అనుష్క 'నిశ్శబ్దం', రామ్‌ 'రెడ్‌', వైష్ణవ్‌ తేజ్‌ 'ఉప్పెన', రాజ్‌తరుణ్‌ 'ఒరేయ్‌ బుజ్జిగా', ప్రదీప్‌ '30రోజుల్లో ప్రేమించటం ఎలా?' తదితర చిత్రాలున్నాయి. అలాగే కొద్దిరోజుల చిత్రీకరణ మిగిలి ఉన్నవాటిలో రవితేజ ‘'క్రాక్’', నాగచైతన్య 'లవ్‌స్టోరీ' లాంటివి లైన్‌లో నిలిచాయి. వీటిల్లో 'రెడ్‌', 'క్రాక్‌', 'ఉప్పెన' లాంటి చిత్రాలు మినహా మిగిలినవి ఓటీటీ బాటలో పయనించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వీటిలో మరికొన్ని చిత్రాలు థియేటర్లనే లక్ష్యంగా పెట్టుకున్నా సంక్రాంతి రేసు మరింత రంజుగా మారే అవకాశముంటుంది. కరోనా భయం తొలగి... థియేటర్లకు ప్రేక్షకులు ఎప్పుడొస్తారనే సంశయం మిగిలే ఉంది.

యువ హీరోల పోటాపోటీ..

ఈసారి సంక్రాంతి బరిలో అగ్ర కథానాయకుల జోరు కనిపించకున్నా.. ఆ లోటును భర్తీ చేసి సినీ ప్రియులకు వినోదాల విందు వడ్డించేందుకు అరడజను మందికి పైగా యువ హీరోలు సిద్ధంగానే ఉన్నారు. ప్రస్తుతం తుది దశ చిత్రీకరణలో ఉన్న సాయితేజ్‌ 'సోలో బ్రతుకే సో బెటరు', నితిన్‌ 'రంగ్‌ దే', అఖిల్‌ 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌', శర్వానంద్‌ 'శ్రీకారం', బెల్లంకొండ శ్రీనివాస్‌ 'అల్లుడు అదుర్స్‌' తదితర చిత్రాలు సంక్రాంతినే లక్ష్యంగా చేసుకున్నాయి. అంతేకాదు ఇటీవలే సెట్స్‌పైకి వెళ్లిన క్రిష్‌ - వైష్ణవ్‌ తేజల కొత్త చిత్రమూ ముగ్గుల పండగనే టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వేగంగా చిత్రీకరణ జరుపుకొంటోన్న ఈ చిత్రం.. అక్టోబరు నాటికి పూర్తి కానుంది. నితిన్‌ 'రంగ్‌ దే'ను సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు చిత్రబృందం సూచన ప్రాయంగా ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.