ETV Bharat / sitara

టాలీవుడ్ మూవీ క్యాలెండర్@2021

లాక్​డౌన్ కారణంగా వాయిదాపడిన చిత్రాలు రిలీజ్ డేట్స్​ ఖరారు చేసుకున్నాయి. దీంతో ఈ ఏడాది క్యాలెండర్ ఇప్పటికే ఫుల్​గా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ప్రకటించిన సినిమాల విడుదల తేదీలను ఓసారి చూద్దాం.

Tollywood movie release 2021 calendar
టాలీవుడ్ మూవీ క్యాలెండర్@2021
author img

By

Published : Mar 2, 2021, 9:32 AM IST

లాక్​డౌన్ కారణంగా విడుదల వాయిదా పడిన చిత్రాలు అన్ని సమస్యలను అధిగమిస్తూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఫిబ్రవరి 12న మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన తొలి సినిమా 'ఉప్పెన' విడుదలవగా.. అల్లరి నరేశ్ 'నాంది', సుమంత్ 'కపటధారి' 19న ప్రేక్షకుల్ని పలకరించాయి. కాగా, నితిన్, చంద్రశేఖర్ ఏలేటి కలయికలో రూపొందిన 'చెక్', శ్వేతా నందిత అక్షర ఫిబ్రవరి 26న థియేటర్లకు వచ్చాయి. మార్చి నుంచి మరిన్ని సినిమాలు సందడి చేయనున్నాయి. మొత్తంగా ఇప్పటివరకు రిలీజ్ కన్ఫర్మ్ చేసుకున్న మూవీలేంటో చూద్దాం.

మార్చిలో సందడే సందడి

మార్చి నెలను బాక్సాఫీస్​ అన్​సీజన్​గా భావిస్తారు. కానీ ఈసారి కరోనా కారణంగా చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. దీంతో ఈ నెలలోనూ పలు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు నిర్మాతలు. ఇందులో మార్చి 5న సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా తెరకెక్కిన 'ఏ1 ఎక్స్​ప్రెస్', రాజ్​తరుణ్ హీరోగా రూపొందిన 'పవర్​ప్లే' , ప్రముఖ సీరియల్ 'మొగలిరేకులు' ఫేమ్ సాగర్ హీరోగా నటించిన 'షాదీ ముబారక్' ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరో వారంలో శర్వానంద్ 'శ్రీకారం', నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధానపాత్రల్లో నటించిన 'జాతిరత్నాలు', శ్రీ విష్ణు 'గాలి సంపత్' మార్చి 11న థియేటర్లకు రానున్నాయి. తర్వాత వారంలో ఆది సాయికుమార్ 'శశి', కార్తికేయ 'చావుకబురు చల్లగా' 19న విడుదలకానున్నాయి. ఇక చివరి వారంలో నితిన్ 'రంగ్​దే', రానా 'అరణ్య' 26న, శ్రీసింహ 'తెల్లవారితే గురువారం' 27న అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి.

Tollywood movie releases 2021 calendar
మార్చిలో విడుదల కానున్న సినిమాలు

'వకీల్​సాబ్​' వచ్చేస్తున్నాడు

ఏప్రిల్ 2న గోపిచంద్ 'సీటీమార్' రానుండగా, ఇదే రోజున నాగార్జున 'వైల్డ్ డాగ్' విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఏప్రిల్ 9న పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్' థియేటర్లకు రానుంది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన 'లవ్​స్టోరి' ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాని 'టక్ జగదీష్' కూడా 'లవ్​స్టోరి'తో పోటీపడబోతుంది. ఇక ఏప్రిల్ 23న జయలలిత బయోపిక్ 'తలైవి' విడుదల కానుంది. ఇందులో కంగనా రనౌత్ హీరోయిన్. చివరగా ఏప్రిల్ 30న రానా-సాయిపల్లవిల 'విరాటపర్వం' విడుదలకాబోతుంది. ఒకే నెలలో సాయిపల్లవి నటించిన రెండు సినిమాలు విడుదల కానుండటం ఆమె అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

Tollywood movie releases 2021 calendar
ఏప్రిల్​లో విడుదల కానున్న చిత్రాలు

మేలో చిరు-బాలయ్య-వెంకీ సందడి

ఇక మే నెలలో ముగ్గురు అగ్రహీరోలు బాక్సాఫీసును షేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. మే 7న అక్కినేని అఖిల్, పూజా హెగ్డే నటించిన 'మోస్ట్​ ఎలిజిబుల్ బ్యాచిలర్' రానుండగా.. ఒక వారం వ్యవధిలోనే వెంకటేశ్, చిరంజీవి చిత్రాలు విడుదల కాబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'ఆచార్య' మే 13న విడుదల కానుండగా.. మే 14న వెంకీ నటించిన 'నారప్ప' రాబోతుంది. చిరంజీవి 'ఆచార్య'తో మలయాళ సూపర్​స్టార్ మోహన్​లాల్ పోటీపడబోతున్నారు. ఈయన నటించిన 'మరక్కార్' కూడా మే 13న థియేటర్లకు రానుంది. మే 28న బాలయ్య-బోయపాటి కాంబోలో రాబోతున్న సినిమా విడుదలవనుంది. ఇక ఇదే రోజుల రవితేజ హీరోగా నటిస్తోన్న 'ఖిలాడి' ప్రేక్షకుల్ని పలకరించనుంది.

Tollywood movie releases 2021 calendar
మేలో విడుదల కానున్న చిత్రాలు

జూన్​లో

కీర్తి సురేశ్ హీరోయిన్​గా నటించిన 'గుడ్​లక్ సఖి' ఈనెల 3న విడుదల కానుంది. ఆకాశ్ పూరీ, కేతికా శర్మ జంటగా నటిస్తున్న చిత్రం 'రొమాంటిక్' 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.

జులైలో ప్రభాస్​తో వరుణ్ పోటీ

జులైలో అడవి శేష్​తో మహేశ్​బాబు నిర్మించిన 'మేజర్' విడుదలకానుంది. జులై 2న 'మేజర్' విడుదలను అధికారికంగా ప్రకటించారు. అలాగే జులైలో పాన్ ఇండియా సినిమాలు పోటీకి సిద్ధమయ్యాయి. ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్ చాప్టర్ 2' జులై 16న విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్'తో పాటు వరుణ్​తేజ్ నటించిన 'గని' జులై 30న బాక్సాఫీసును తాకనుంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య పోటీ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది.

Tollywood movie releases 2021 calendar
జులైలో విడుదల కానున్న చిత్రాలు

ఆగస్టులో 'పుష్పరాజ్​' రాక

ఇక ఆగస్టులో సుకుమార్, అల్లు అర్జున్ కలయికలో వస్తున్న మూడో సినిమా రికార్డుల మోత మోగించేందుకు సిద్ధమవుతోంది. ఆగస్టు 13న 'పుష్ప' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆగస్టు 19న శర్వానంద్, సిద్ధార్థ్ మల్టీస్టారర్ 'మహాసముద్రం' విడుదలకానుంది. 2019లో నవ్వులు పూయించి నిర్మాతలకు కనకవర్షం కురిపించిన 'ఎఫ్ 2'కు కొనసాగింపుగా వస్తున్న 'ఎఫ్ 3' ఆగస్టు 27న సందడి చేయనుంది.

Tollywood movie releases 2021 calendar
ఆగస్టులో విడుదల కానున్న చిత్రాలు

సెప్టెంబర్

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'లైగర్' చిత్రాన్ని సెప్టెంబర్ 9న విడుదల చేయనున్నారు. ఇదే నెలలో పవన్ కల్యాణ్, రానా మల్టీస్టారర్​ కూడా ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం.

Tollywood movie releases 2021 calendar
సెప్టెంబర్​లో విడుదల కానున్న చిత్రాలు

ఆర్ఆర్ఆర్

అక్టోబర్​లో రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్​ఆర్​ఆర్​' సినిమా పాత రికార్డులను తుడిచిపెట్టేందుకు రాబోతుంది. ఆ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదలకానుంది.

Tollywood movie releases 2021 calendar
ఆర్ఆర్ఆర్

వచ్చే సంక్రాంతికి పవర్​స్టార్-సూపర్​స్టార్ ఫైట్

ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి బాక్సాఫీస్​ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి పవన్-క్రిష్ చిత్రం, మహేశ్ బాబు 'సర్కారువారి పాట'. ఇప్పటికే పవన్ సినిమా రిలీజ్​ను అధికారికంగా ప్రకటించగా, మహేశ్ చిత్రం అప్​డేట్ త్వరలోనే రానుంది.

Tollywood movie releases 2021 calendar
సంక్రాంతికి పవన్-మహేశ్ చిత్రాలు

వచ్చే వేసవికి ప్రభాస్

యంగ్ రెబల్​స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం​ 'సలార్'. వచ్చే ఏడాది ఏప్రిల్ 14 ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. శరవేగంగా చిత్రీకరణ సాగుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్​గా నటిస్తోంది.

Tollywood movie releases 2021 calendar
సలార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.