ETV Bharat / sitara

'అతిలోకసుందరి బయోపిక్​లో నటించాలనేది నా కల​' - rajput as sridevi

అతిలోకసుందరి శ్రీదేవి బయోపిక్​లో నటించాలనేది తన డ్రీమ్​రోల్​ అని చెప్పిన హీరోయిన్​ పాయల్​ రాజ్​పుత్​... ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది.

payal
పాయల్​
author img

By

Published : Jun 22, 2020, 9:31 AM IST

Updated : Jun 22, 2020, 11:10 AM IST

'ఆర్​ఎక్స్ 100'తో కుర్రకారుల మదిని దోచిన​ ముద్దుగుమ్మ పాయల్​ రాజ్​పుత్​. తొలి సినిమాతోనే హిట్​ కొట్టి, ఎంతోమంది అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన డ్రీమ్​రోల్ గురించి చెప్పింది.​

"చిన్నప్పటి నుంచి శ్రీదేవి సినిమాలు చూస్తు పెరిగాను. ఆమె వెండితెరపై ఓ మ్యాజిక్​ను సృష్టించారు. ఎప్పటికైనా ఆమె బయోపిక్​లో నటించే అదృష్టం, అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్నా"

-పాయల్​ రాజ్​పుత్​, హీరోయిన్​.

sridevi
శ్రీదేవి

హిందీ టీవీ సీరియల్స్​తో ప్రయాణం మొదలుపెట్టిన ఈ భామ.. పంజాబ్​లో వచ్చిన 'సైరట్​' రీమేక్​తో హీరోయిన్​గా అరంగేట్రం చేసింది. ఆ తర్వాత పలు భాషల్లో నటిస్తూ బిజీగా మారింది. అనంతరం టాలీవుడ్​లో 'ఆర్​ఎక్స్​ 100'తో క్రేజ్ తెచ్చుకుంది. 'ఎన్టీఆర్​ కథానాయకుడు', 'సీత', 'ఆర్డీఎక్స్​ లవ్', 'వెంకీమామ', 'డిస్కోరాజా' సినిమాల్లో అగ్రహీరోలతో కలిసి నటించి మెప్పించింది. ​

ఇది చూడండి : 'ఇలాంటప్పుడే పర్యావరణం కాపాడుకోవడం ముఖ్యం'

Last Updated : Jun 22, 2020, 11:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.