ETV Bharat / sitara

ఈ పంద్రాగస్టుకు.. ఈ వెబ్​సిరీస్​లు చూసేయండి - Code M

ఈసారి స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశభక్తితో నింపుకోవడం సహా మంచి వెబ్ సిరీస్​లు చూడాలని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీకోసమే. దేశం నేపథ్య కథతో తీసిన ఈ సిరీస్​లు మిమ్మల్ని అలరించడమే కాకుండా మీకున్న ఇష్టాన్ని మరింత పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు!

this-independence-day-binge-watch-these-12-patriotic-web-series
ఓటీటీ చిత్రాలు
author img

By

Published : Aug 15, 2021, 11:00 AM IST

స్వాతంత్ర్య దినోత్సవం అనగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చే సినిమా 'ఖడ్గం.' ఇప్పటికీ ఆ సినిమా టీవీల్లో ప్రసారమవుతుంది. ఈ దేశభక్తి సినిమాను చాలా మంది చూడటానికి ఇష్టపడతారు. అయితే మార్పుకోరుకునే వారికి అనేక దేశభక్తి కథలు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ ఓటీటీ వేదికల్లో వెబ్​సిరీస్​ రూపంలో ఇవి ఇప్పటికే అలరిస్తున్నాయి. ఈ పంద్రాగస్టుకు మీరూ వీటిపై ఓ లుక్కేయండి.

ది ఫ్యామిలీ మ్యాన్​(The family man)..

ది ఫ్యామిలీ మ్యాన్​.. ఓ స్పై డ్రామా సిరీస్​. ఇప్పటికి రెండు భాగాలు వచ్చాయి. రెండింటికీ మంచి ఆదరణ లభించింది. ఓ నిఘా ఆఫీసర్​.. అటు దేశాన్ని ఉగ్రవాదుల నుంచి రక్షిస్తూనే తన వ్యక్తిగత జీవితంలో ఉన్న సమస్యలను ఎలా పరిష్కరించుకున్నాడు అనేది కథ. ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది ఈ వెబ్​ సిరీస్​. మనోజ్​ బాజ్​పేయీ నటన ఈ వెబ్​ సిరీస్​ స్థాయిని అమాంతం పెంచేసింది. ఇక ఆలస్యం చేయకుండా అమెజాన్​ ప్రైమ్​లో మీరూ ఈ సిరీస్​​ చూసేయండి.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ది ఫర్గాటెన్​ ఆర్మీ- ఆజాదీ కే లియే(The Forgotten Army - Azaadi ke Liye)...

నిజ జీవతాల ఆధారంగా కబీర్​ ఖాన్​ ఈ సిరీస్​ను తెరకెక్కించారు. నేతాజీ సుభాష్​ చంద్ర బోస్​ సారథ్యంలో ఇండియన్​ నేషనల్​ ఆర్మీ సభ్యులు.. దేశ స్వాతంత్ర్యం కోసం ఏ విధంగా పోరాటం చేశారనేది కథ. విక్కీ కౌశల్​ సోదరుడు సన్నీ కౌశల్​, శర్వారి వా కీలక పాత్రలు పోషించారు. అమెజాన్​ ప్రైమ్​లో ఇది అందుబాటులో ఉంది.

కోడ్​ ఎమ్​(Code M)..

ఓ ఎన్​కౌంటర్​ చుట్టూ సాగే కేసుపై ఆధారపడిన ఇది. ఎన్​కౌంటర్​ కారణంగా ఓ ఆర్మీ అధికారి, ఇద్దరు ముష్కరులు మరణించారని కేసు మూసేస్తారు. కానీ అక్కడ ఎన్​కౌంటర్​కు మించిన వ్యవహారం ఉందని తెలుసుకున్న ఓ న్యాయవాది.. కేసును ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది మిగిలిన కథ. న్యాయవాదిగా మానికా మెహ్రా మంచి ప్రదర్శన చేసింది. రజత్​ కపూర్​, సీమా విశ్వాస్​, తనూజ్​ విర్వాని నటన కథకు కీలకం. ఇది ఏఎల్​టీ బాలాజీ, జీ5లో అందుబాటులో ఉంది.

జీత్​ కి జిద్(Jeet Ki Zid)​...

ఆర్మీ స్పెషల్​ఫోర్స్​ ఆఫీసర్​ మేజర్​ దీపేంద్ర సింగ్​ సెంగార్​ జీవితం ఆధారంగా రూపొందిన వెబ్​ సిరిస్​ జీత్​ కి జిద్​. కార్గిల్​ యుద్ధం సమయంలో పక్షవాతానికి గురైనప్పటికీ.. జీవిత పోరాటాన్ని సెంగార్​ సాగించిన తీరును చక్కగా చూపించారు. విశాల్​ మంగోల్కర్​ దర్శకత్వంలో అమిత్​ సాద్​.. మేజర్​ దీపేంద్రగా చక్కటి నటను ప్రదర్శించారు. ఇది జీ5 యాప్​లో అందుబాటులో ఉంది.

అవ్​రోధ్​- ది సీజ్​ వితిన్​(Avrodh: The Siege Within)...

2016 ఉరి లక్షిత దాడుల నేపథ్యంలో సాగుతుంది ఈ కథ. 'ఇండియాస్​ మోస్ట్​ ఫియర్​లెస్​' పుస్తకం దీనికి మూలం. అమిత్​ సాధ్​, నీరజ్​ కబి లీడ్​ రోల్స్​లో నటించారు. రాజ్​ ఆచార్య తెరకెక్కించిన ఈ వెబ్​సిరీస్​ సోనీలివ్​లో అందుబాటులో ఉంది.

రెజిమెంట్​ డైరీస్​(Regiment Diaries)...

ఈ వెబ్​ సిరీస్​లో భారత సైనికుల కథలను చిత్రీకరించారు. నిజ జీవితంలోని వ్యక్తులు, వారికి జరిగిన ఎన్నో సంఘటనల సమూహం ఈ రెజిమెంట్​ డైరీస్​. ఇంటర్వ్యూలు, చారిత్రక ఫుటేజీలతో కథలు అద్భుతంగా ముందుకు సాగుతాయి. సోనీలివ్​లో ఇది చూడవచ్చు.

స్పెషల్​ ఆప్స్​(Special OPS)...

26/11 ముంబయి దాడులతో సహా గత 19ఏళ్లల్లో భారత్​పై జరిగిన ఉగ్రదాడుల ఆధారంగా ఈ వెబ్​సిరీస్​ను రూపొందించారు. కే​ మీనన్​, దివ్య దత్త, సయామీ ఖేర్​, కరణ్​ థాకర్​, వినయ్​ పాథక్​, ముజామ్మిల్​ ఇబ్రహీమ్​ వంటి నటులు అద్భుత ప్రదర్శనలు చేశారు. నీరజ్​ పాండే, శివమ్​ నాయర్​ దర్శకత్వం వహించిన ఈ సిరీస్​ డిస్నీ+ హాట్​స్టార్​లో స్ట్రీమ్​ అవుతోంది.

బోస్​ డెడ్​ ఆర్​ ఎలైవ్​(Bose Dead or Alive)...

సుభాష్​ చంద్ర బోస్​ జీవితం ఆధారంగా ఈ వెబ్​సిరీస్​ను రూపొందించారు. రాజ్​ కుమార్​ రావ్..​ బోస్​ పాత్రలో నటించి మెప్పించారు. స్వాతంత్ర్యం కోసం నేతాజీ చేసిన పోరాటం నుంచి ఆయన అనుమానాస్పద మరణం వరకు ఈ కథ సాగుతుంది. ఎమ్​ఎక్స్​ ప్లేయర్​లో ఈ సిరీస్​ చూడొచ్చు.

బార్డ్​ ఆఫ్​ బ్లడ్​(Bard of Blood)...

బాలీవుడ్ ప్రముఖ​ నటుడు ఇమ్రాన్​ హష్మి నటించిన ఈ స్పై థ్రిల్లర్​కు మంచి ఆదరణ లభించింది. 2015లో వచ్చిన బార్డ్​ ఆఫ్​ బ్లడ్​ నవల ఆధారంగా ఈ సిరీస్​ తెరకెక్కింది. గూఢచర్యం చుట్టూ కథ అల్లారు. కృతి కుల్హారి, వినీత్​ కుమార్​ సింగ్​, జైదీప్​ అహ్లవాత్​, శోభితా ధూలిపాళ్ల నటించిన బార్డ్​ ఆఫ్​ బ్లడ్​.. నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమ్​ అవుతోంది.

ది టెస్ట్​ కేస్​(The Test Case)..

స్పెషల్​ ఫోర్స్​లోని ఏకైక మహిళ కెప్టెన్​ శిఖా శర్మ కథ ఆధారంగా ఈ సిరీస్​ తీశారు. నిమ్రిత్​ కౌర్​ ప్రధాన పాత్ర పోషించింది. అతుల్​ కులకర్ణి, అనూప్​ సొనీ కీలక పాత్రల్లో నటించారు. ఏఎల్​టీ బాలాజీ, జీ5లో ఈ వెబ్​సిరీస్​ అందుబాటులో ఉంది.

21 సర్ఫరోష్​- సారాగఢి 1897(21 Sarfarosh: Saragarhi 1897)

సారాగఢి యుద్ధం ఆధారంగా ఈ వెబ్​సిరీస్​ తెరకెక్కింది. 1897లో ఆక్రమణకు ప్రయత్నించిన పస్థూన్​ ఒరక్​జీ తెగ ప్రజలతో నాటి బ్రిటీష్​ ఇండియా ఆర్మీలోని 21మంది సిక్కు సైనికులు వీరోచితంగా పోరాడారు. 21మంది 10,000కుపైగా మందిని అడ్డుకున్నారు. ఈ పోరాటం దేశ చరిత్రలో నిలిచిపోయింది. మోహిత్​ రైనా, ముకుల్​ దేవ్​ కీలక పాత్రలు పోషించారు. నెట్​ఫ్లిక్స్​లో ఇది స్ట్రీమ్​ అవుతోంది.

పీఓడబ్ల్యూ- బంధి యుధ్​ కీ(POW: Bandhi Yudh Ke)...

ఇదొక పొలిటికల్​ థ్రిల్లర్​. 17ఏళ్ల నిర్బంధం నుంచి విడుదలైన అనంతరం ఇద్దరు సైనికులు తమ కుటుంబాలను కలుసుకోవడం ఈ కథ సారాంశం. అమృత పూరి, సంధ్య మృదుల్​, పురబ్​ కోహ్లి, సత్యదీప్​ మిశ్రా కీలక పాత్రలు పోషించారు. హాట్​స్టార్​లో ఇది స్ట్రీమ్​ అవుతోంది.

ఇదీ చూడండి:- ఓటీటీలో ఆ 'స్టోరీ'ల​కు ఎందుకంత క్రేజ్?​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.