ETV Bharat / sitara

సుశాంత్ సింగ్ ఫొటోలు పోస్ట్ చేస్తే కఠిన చర్యలు! - sushanth singh death updates

హీరో సుశాంత్ సింగ్ మృతదేహానికి సంబంధించిన ఫొటోలు.. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయొద్దని, ఇప్పటికే ఉన్నవాటిని తొలగించాలని మహారాష్ట్ర సైబర్​క్రైమ్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

SUSHANTH SINGH RAJPUT CYBER CRIME
'సామాజిక మాధ్యమాల్లో సుశాంత్​ మృతదేహం ఫొటోలను పెట్టొద్దు'
author img

By

Published : Jun 15, 2020, 10:44 AM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మృతదేహం ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేయవద్దని మహారాష్ట్ర సైబర్​ క్రైమ్​ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆ ఫొటోలను చాలా మంది సోషల్​ మీడియాలో పోస్ట్ చేశారని, ఇది మంచి పద్ధతి కాదని పోలీసులు తెలిపారు. సదరు ఫొటోల ప్రసారం న్యాయస్థానాల మార్గదర్శకాలకు విరుద్ధమని.. అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇప్పటికే పోస్ట్​ చేసిన చిత్రాలను తొలగించాలని నెటిజన్లకు పోలీసులకు సూచించారు. సుశాంత్​ సింగ్​ ఇంట్లో తమకు ఎలాంటి నోట్ దొరకలేదని చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ఏదైనా విషయాన్ని పంచుకున్నప్పుడు​ ఆ సమాచారాన్ని ముందుగా ధ్రువీకరించుకోవాలని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.