ETV Bharat / sitara

తెలుగు వెబ్​ సిరీస్​కు మిల్కీబ్యూటీ గ్రీన్​సిగ్నల్​! - tamanna playing lead role in telugu web series

మిల్కీబ్యూటీ తమన్నా ఓ తెలుగు వెబ్​ సిరీస్​లో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. 'గరుడ వేగ' ఫేమ్​ ప్రవీణ్​ సత్తారు ఈ సిరీస్​కు దర్శకత్వం వహించనున్నాడు.

Tamannaah to star in a Telugu web-series?
తెలుగు వెబ్​-సిరీస్​కు మిల్కీబ్యూటీ గ్రీన్​సిగ్నల్​!
author img

By

Published : Sep 17, 2020, 10:26 AM IST

తెలుగులో రూపొందబోయే ఓ వెబ్​సిరీస్​లో ప్రధాన పాత్ర పోషించడానికి స్టార్​ హీరోయిన్​ తమన్నా గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లు సమాచారం. థ్రిల్లర్​ కథాంశంతో సాగే ఈ సిరీస్​ను 'గరుడ వేగ' ఫేమ్​ ప్రవీణ్​ సత్తారు తెరకెక్కించనున్నాడు. 8 ఎపిసోడ్లతో రూపొందే ఈ సిరీస్​ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్​ఫామ్​ ప్రసారం చేయడానికి ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది.

Tamannaah to star in a Telugu web-series?
తమన్నా

ప్రస్తుతం గోపీచంద్​ హీరోగా తెరకెక్కుతోన్న స్పోర్ట్స్​ డ్రామా 'సీటీమార్​' చిత్రంలో కబడ్డీ కోచ్​గా, బాలీవుడ్​ స్టార్​ నవాజుద్దీన్​ సిద్దిఖీ నటిస్తున్న 'బోలే చుడియన్'​ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది తమన్నా. ఆమె నటించిన 'దటీజ్​ మహాలక్ష్మీ' చిత్రం నేరుగా ఓటీటీల్లో విడుదలవుతుందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.