ETV Bharat / sitara

'గల్లీరౌడీ' రిలీజ్​ డేట్​.. నిఖిల్​ కొత్త సినిమా అప్​డేట్​ - రవితేజ ఖిలాడి

టాలీవుడ్​ నుంచి కొత్త సినిమా కబుర్లు వచ్చేశాయి. 'గల్లీరౌడీ', 'ఖిలాడి' సినిమాలతో పాటు నిఖిల్​ కొత్త సినిమా అప్​డేట్స్​ ఉన్నాయి.

Sundeep Kishan's Gully Rowdy Release Date
'గల్లీరౌడీ' రిలీజ్​ డేట్​.. నిఖిల్​ కొత్త సినిమా అప్​డేట్​
author img

By

Published : Aug 15, 2021, 12:46 PM IST

సందీప్‌ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం 'గల్లీ రౌడీ'. జి.నాగేశ్వర రెడ్డి దర్శకుడు. ఇటీవలే సెన్సార్​ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధమైంది. సెప్టెంబరు 3న థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్న చిత్రబృందం ప్రకటించింది. కోనా ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా సంయుక్తంగా నిర్మించాయి.

Sundeep Kishan's Gully Rowdy Release Date
'గల్లీ రౌడీ' రిలీజ్​ పోస్టర్​

నిఖిల్​ సిద్ధార్థ్ హీరోగా యాక్షన్​-స్పై కథాంశంతో ఓ సినిమా రూపొందనుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా గురించి ప్రకటన చేశారు. 'గూఢచారి', 'ఎవరు', 'హిట్​' సినిమాలకు ఎడిటర్​గా పనిచేసిన గారీ బీహెచ్​ ఈ సినిమాతో దర్శకుడిగా మారారు. రెడ్​ సినిమాస్​ పతాకంపై కే రాజశేఖర్​ రెడ్డి నిర్మాతగా వ్యవహరించనున్నారు.

నిఖిల్​ కొత్త సినిమా పోస్టర్​

రవితేజ హీరోగా రమేశ్ వర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం 'ఖిలాడి'. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తి చేసుకుందీ సినిమా. కరోనా తీవ్రత తగ్గడం వల్ల ఇటీవలే చిత్రీకరణను తిరిగి ప్రారంభించారు. ఆగస్టు 15న యాక్షన్​ కింగ్​ అర్జున్​ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఫస్ట్​లుక్​ను చిత్రబృందం విడుదల చేసింది.

'ఖిలాడి' సినిమాలో అర్జున్​ ఫస్ట్​లుక్​

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వీటితో పాటు అనేక చిత్రాల నుంచి పోస్టర్లు విడుదలయ్యాయి.

'మ్యాస్ట్రో' పోస్టర్​

'లక్ష్య' సినిమా పోస్టర్​

'శ్రీదేవి సోడా సెంటర్​' సినిమా పోస్టర్​

ఇదీ చూడండి.. బాలయ్య చేతుల మీదుగా 'కవిసమ్రాట్​' ఫస్ట్​లుక్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.