మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ సంపాందించుకున్న అక్కినేని యువనటుడు అఖిల్. ఇప్పటివరకు ఇతడు నటించిన మూడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరైన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. అయినప్పటికీ తన నాలుగో చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్'తో హిట్ అందుకుంటాననే ఆశాభావంతో ఉన్నాడు అఖిల్.
ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే ఇప్పుడు మరో చిత్రానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడట అఖిల్. స్టైలిష్ చిత్రాల దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన తర్వాతి ప్రాజెక్ట్ చేయనున్నాడని టాక్. ఇప్పటికే 'సైరా' తర్వాత సురేందర్ రెడ్డి సినిమాపై అనేక రూమర్లు వినిపిస్తున్నాయి. రామ్ చరణ్, అల్లు అర్జున్‌తోనూ ఈ దర్శకుడు సినిమాలు తీసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి వీరిలో సురేందర్ ఎవరితో సినిమా చేస్తాడో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.