ETV Bharat / sitara

బాలకృష్ణ సినిమాలో విలన్​గా ఆ ​హీరో! - బాలకృష్ణ సినిమాలో విలన్​గా శ్రీకంత్​

బాలకృష్ణ-బోయపాటి కాంబోలో తీస్తున్న మూడో సినిమాలో విలన్​గా శ్రీకాంత్​ నటించనున్నాడని టాక్​. ప్రస్తుతం ఈ విషయమై చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

balakrishna, srikanth
బాలకృష్ణ, శ్రీకాంత్​
author img

By

Published : May 9, 2020, 6:54 PM IST

కథానాయకులను శక్తిమంతమైన ప్రతినాయకులుగా చూపించడం దర్శకుడు బోయపాటి శ్రీనుకే చెల్లింది. ఇప్పటికే 'లెజండ్​'తో జగపతిబాబు, 'వినయ విధేయ రామ'తో వివేక్​ ఒబెరాయ్​, 'సరైనోడు'తో ఆదిపినిశెట్టిని విలన్​లుగా మార్చేసి మెప్పించారు. ఇప్పుడిదే పంథాలో మరో హీరోను ప్రతినాయకుడి‌గా మార్చేందుకు సిద్ధమవుతున్నారు.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో ఓ సినిమా తీస్తున్నారు. ఇప్పటికే ఓ షెడ్యూల్​ను పూర్తి చేసుకుంది. అయితే ఇందులో హీరో శ్రీకాంత్‌ను విలన్​గా చూపించాలని అనుకుంటున్నారట. ఇప్పటికే అతడితో చర్చలు జరిపారని సమాచారం. త్వరలో ఈ విషయమై ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారని, అందులో ఒకటి అఘోరా గెటప్​ అని ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు బోయపాటి.

ఇదీ చూడండి : 'నాగ్​ అశ్విన్​ మరో బయోపిక్ తీయడు​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.