సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఇన్స్టాలో వెల్లడించారు. ఎక్మో/వెంటిలేటర్ సాయంతో చికిత్స కొనసాగుతోందని చెప్పారు. వైద్యులు తన తండ్రికి ఫిజియో థెరపీ చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం ఆయన ఆహారంగా ద్రవ పదార్థాలు తీసుకుంటున్నారని, ఆస్పత్రి నుంచి సాధ్యమైనంత త్వరగా ఇంటికి వెళ్లాలన్న ఆసక్తితో ఉన్నారంటూ చరణ్ పేర్కొన్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
కరోనా వైరస్ సోకడం వల్ల ఆగస్టు 5న బాలసుబ్రహ్మణ్యం.. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారడం వల్ల వైద్యులు వెంటిలేటర్, ఎక్మో సాయంతో చికిత్స ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఇటీవల ఆయనకు కరోనా నెగెటివ్ అని తేలడంతో అందరూ సంతోషం వ్యక్తంచేశారు. బాలు త్వరగా కోలుకొని క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.
ఇదీ చూడండి భర్తను అరెస్ట్ చేయించిన నటి పూనమ్ పాండే