ETV Bharat / sitara

ద్రౌపదిగా సౌందర్య.. 'నర్తనశాల' లుక్ విడుదల - balakrishna news

'నర్తనశాల' సినిమాలోని సౌందర్య ఫస్ట్​లుక్​ విడుదలైంది. ఈనెల 24నుంచి అభిమానులకు అందుబాటులో ఉండనుందీ చిత్రం.

soundarya first look from narthanasala
ద్రౌపదిగా సౌందర్య
author img

By

Published : Oct 21, 2020, 5:40 PM IST

అలనాటి హీరోయిన్ సౌందర్య చివరగా నటించిన చిత్రం 'నర్తనశాల'. ఇందులోని ఆమె ఫస్ట్​లుక్​ను బుధవారం విడుదల చేశారు. ద్రౌపది పాత్రలో ఈమె కనిపించనుంది. దసరా కానుకగా ఈనెల 24నుంచి శ్రేయస్ ఈటీ యాప్​లో ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుందీ చిత్రం.

నందమూరి బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని 2004లో ప్రారంభించారు. అందులో శ్రీహరి, శరత్​బాబు, సౌందర్య తదితరులు ప్రధాన పాత్రల కోసం ఎంపికయ్యారు. అయితే అదే ఏడాది హెలికాప్టర్ ప్రమాదంలో సౌందర్య మరణించడం వల్ల షూటింగ్ నిలిచిపోయింది. ఆమె లాంటి నటి ఎవరైనా ఉంటే ఈ చిత్రాన్ని పూర్తి చేస్తానని బాలయ్య చాలాసార్లు చెప్పారు. కానీ అది కుదరలేదు.

అప్పుడు తీసిన 17 నిమిషాల సన్నివేశాల్ని, ఇప్పుడు అభిమానుల ముందుకు తీసుకురావాలని బాలకృష్ణ నిర్ణయించారు. కనిష్ఠంగా రూ.50 చెల్లించి, ఈ సినిమాను ఏటీటీలో చూడొచ్చు. దాని ద్వారా వచ్చే మొత్తంలో కొంత భాగం బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్​ ట్రస్ట్​కు అందజేస్తామని బాలయ్య ఇప్పటికే వెల్లడించారు.

ఇది చదవండి: 'నర్తనశాల' బుకింగ్స్ ఓపెన్.. శ్రీహరి ఫస్ట్​లుక్ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.