ETV Bharat / sitara

చదువు కోసం సెల్ టవర్ ఏర్పాటు చేసిన సోనూసూద్ - సోనూసూద్ తాజా వార్తలు

తన ఉదారతను మరోసారి చాటుకున్నాడు నటుడు సోనూసూద్. ఓ ఊర్లో సిగ్నల్ కోసం మొబైల్ టవర్ నెలకొల్పి అందరి ప్రశంసలు అందుకున్నాడు.​

Sonu Sood installs mobile tower in Haryana village for students
సెల్ టవర్​ను నెలకొల్పి ఉదారత చాటుకున్న సోనూసూద్
author img

By

Published : Oct 5, 2020, 7:42 PM IST

నటుడు సోనూసూద్ కరోనా కాలంలో అవసరమైన వారికి సాయం చేస్తూ హీరోగా నిలుస్తున్నాడు. లాక్​డౌన్ సమయంలో కూలీలు తమ స్వగ్రామానికి చేరుకోవడానికి మద్దతుగా నిలిచి అందరి ప్రశంసలు అందుకున్నాడు. ఇప్పటికీ తమకు సాయం కావాలని అతడిని సంప్రదిస్తే చాలు.. ఆ పనిని గంటల్లో చేసి పెడుతున్నాడు. తాజాగా ఓ ఊరిలో సెల్ టవర్ వేయించి మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు.

Sonu Sood installs mobile tower in Haryana village for students
చెట్టెక్కి క్లాస్ వింటున్న పిల్లాడు

హరియాణాలోని మొర్ని గ్రామంలో ఓ పిల్లాడు ఆన్​లైన్ క్లాస్ వినేందుకు మొబైల్ ఉపయోగించాల్సి వచ్చింది. అయితే ఆ ఊర్లో సిగ్నల్ సరిగా ఉండదు. దీంతో అతడు ఓ చెట్టెక్కి క్లాస్ వినడాన్ని ఒకరు వీడియో తీసి దానిని ట్విట్టర్​ ద్వారా సోనూసూద్​కు తెలియజేశారు. దీంతో వెంటనే స్పందించిన సోనూ.. ఆ గ్రామ పెద్దలతో మాట్లాడి మొబైల్ టవర్​ను నెలకొల్పాడు. దీంతో ఆ ఊరు ప్రజలతో పాటు నెటిజన్లు సోనూసూద్​పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

టవర్​ వద్ద విద్యార్థులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.