ETV Bharat / sitara

నానితో బోల్డ్​సీన్ అందుకే చేశా: కృతిశెట్టి - nani sai pallavi movie

'శ్యామ్​సింగరాయ్' సినిమాలో స్మోకింగ్ సీన్లు చాలా ఛాలెంజింగ్​గా అనిపించాయని హీరోయిన్ కృతిశెట్టి చెప్పింది. ఇదే చిత్రంలో హీరో నానితో బోల్డ్​ సీన్స్ చేయడానికి గల కారణాన్ని కూడా వెల్లడించింది.

krithi shetty
కృతిశెట్టి
author img

By

Published : Dec 25, 2021, 10:26 PM IST

'ఉప్పెన'తో ఎగసిన యువ అందం కృతిశెట్టి. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ఆ చిత్రంలో 'బేబమ్మ'గా ఆకట్టుకుందీ 18 ఏళ్ల ముద్దగుమ్మ. 'ఉప్పెన'లో పల్లెటూరి అమ్మాయిగా కనిపించిన కృతి.. 'శ్యామ్‌ సింగరాయ్‌'లో మోడ్రన్‌ గాళ్‌గా మెరిసింది. ఈ నేపథ్యంలో కృతిశెట్టి మీడియాతో ముచ్చటించింది. ఆ సినిమాతో పాటు మరిన్ని ఆసక్తికర విషయాలను పంచుకుంది.

‘ఉప్పెన’లో బేబమ్మ, ‘శ్యామ్‌ సింగ రాయ్‌’లో కీర్తి.. ఈ రెండు పాత్రల ప్రయాణం ఎలా సాగింది?

కృతి శెట్టి: ‘బేబమ్మ’, ‘కీర్తి’ మధ్య ఎలాంటి పోలికలూ ఉండవు. ‘బేబమ్మ’లా కనిపించేందుకు సంపద్రాయం గురించి తెలుసుకోవాలని, పల్లెటూరి అమ్మాయిగా ఆకట్టుకోవాలని చాలా తెలుగు సినిమాలు చూశా. కీర్తి పాత్ర కోసం కోసం ఇంగ్లీష్‌ సినిమాలు, మోడ్రన్ అమ్మాయిలు ఎలా ఉంటారో తెలుసుకుని, నా స్టైల్లో నటించా.

krithi shetty nani
నాని కృతిశెట్టి

కీర్తి పాత్ర పోషించేటప్పుడు ఏది ఛాలెంజింగ్‌గా అనిపించింది?

కృతి: స్మోకింగ్‌ సీన్స్‌లో నటించడం (నవ్వులు). వాస్తవానికి నాకు స్మోకింగ్‌ అంటే అసహ్యం. మొదట్లో దర్శకుడు రాహుల్‌ కథ చెబుతున్నప్పుడే స్మోకింగ్‌ సీన్స్‌ తీసేయొచ్చుగా అన్నా. ‘అది కీర్తి, నువ్వు కృతి.. ఇద్దరి మధ్య ఉండే తేడా అదే కదా’ అన్నారు. అందులో నేను కాల్చింది నికోటిన్‌ లేని హెర్బల్‌ సిగరెట్‌. అది నాకోసం స్పెషల్‌గా తీసుకొచ్చారు. మొదటిసారి పట్టుకున్నప్పుడు నా చేయి వణికింది. ఆ తర్వాత సిగరెట్లను తాగడం మూడు రోజులు ప్రాక్టీస్ చేశా. కాస్త తేలిక అయింది.

తొలి చిత్రంలో అందరూ కొత్తే.. ఇందులో అందరూ అనుభవం ఉన్న నటులతో పనిచేయడం ఎలా అనిపించింది?

కృతి: నానితో నటించడమంటే మొదట్లో భయం వేసింది. సెట్‌లో అడుగుపెట్టాక ఆ భయం పోయింది. సెట్‌లో ఆయన ఎంతో ప్రోత్సహించేవారు. ఎవరి నటన బాగోకపోయినా ఎవర్నీ నొప్పించకుండా అర్థమయ్యేలా చెప్తారు. ప్రతి ఒక్కరి నటననూ పరిశీలించి మార్పులు చేర్పులు సూచిస్తారు. ఆయనిచ్చే సపోర్ట్‌ వల్లే సీన్స్‌ అంత బాగా పండాయి.

ఇందులో కొన్ని బోల్డ్‌ సీన్స్‌లో నటించారు. దాని గురించి మీ అభిప్రాయం చెప్పండి?

కృతి: బోల్డ్‌ సీన్స్‌ అంటే అందరూ చెడు ఉద్దేశంతో చూస్తారు. ఏం చేసినా అంతా వృత్తిపరంగానే చూస్తా. ఏది చేసినా అది యాక్టింగ్‌. యాక్షన్ సీన్స్‌లో ఎంత కష్టపడతామో ఇవీ అంతే. అన్ని సీన్లలోనూ నటించినట్టే ఆ సన్నివేశాల్లోనూ నటిస్తాం. ఇండస్ట్రీలోకి రాకముందు నేను ఎక్కువగా సినిమాలు చూడలేదు. కథలో ఆ సీన్స్ అవసరం అనిపిస్తేనే చేస్తా. లేదంటే చేయను. ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో నాకు నానికి మధ్య వచ్చిన బోల్డ్‌ సీన్‌ కథ డిమాండ్‌ చేసింది. కథకి ఆ సీన్‌కి సంబంధం ఉంది కాబట్టే చేశా.

krithi shetty
కృతిశెట్టి

కీర్తి పాత్రకు వచ్చిన బెస్ట్‌ కాంప్లిమెంట్ ఏది. ఎవరిచ్చారు?

కృతి: నాన్న చూసి చాలా బాగా చేశావని మెచ్చుకున్నారు. ఆయన షూటింగ్‌కు రాలేదు. లుక్‌ గురించి పెద్దగా తెలియదు. చాలా కొత్తగా ఉందన్నారు.

‘ఉప్పెన’లో బేబమ్మతో పోలిస్తే కీర్తి పాత్రలో పెద్దగా నటించే అవకాశం లేదు. అయినా ఎందుకు ఒప్పుకొన్నారు?

కృతి: ‘ఉప్పెన’లో నటించేందుకు ఎక్కువ స్కోప్‌ ఉంది. కానీ, ఇందులో నాలోని ఇంకో కోణాన్ని చూపించే అవకాశం వచ్చింది. ఉప్పెన తరువాత అన్నీ పల్లెటూరి పాత్రలే వచ్చాయి. అందుకే వాటిని నిరాకరించా. పాత్ర పరంగా కీర్తి అంతా కొత్త లుక్‌, కొత్త పాత్ర అని చేశా. ఇదొక డిఫరెంట్‌ రోల్. ఛాలెంజింగ్‌గానూ అనిపించింది. అందుకే చేశా. నాకెక్కువ భిన్నపాత్రలు చేయాలని ఉంటుంది.

‘శ్యామ్‌ సింగరాయ్‌’లో మీ పాత్ర నిడివి కాస్త తక్కువే! దాని గురించి ఏమంటారు?

కృతి: నిడివి కంటే ఆ పాత్ర గొప్పతనం గురించే ఆలోచిస్తా. ఇంటర్వెల్‌ వరకూ ఉంటుందా? తర్వాత ఉండదా?అని ఆలోచించను. ఇప్పుడే నటిగా నా ప్రయాణం మొదలైంది. ఓ పాత్రకు ఓకే చెప్పినప్పుడు అది డిఫెరెంట్‌గా, ఛాలెంజింగ్‌గా.. కొత్తగా ఏమైనా తెలుసుకునే అవకాశం ఉంటుందా?అనేది మాత్రం చూసుకుంటా. రకరకాల పాత్రలను చేస్తే ఎంతో నేర్చుకునే అవకాశం ఉంటుంది. కామెడీ పాత్రలు చేస్తే ఆ టైమింగ్ తెలుస్తుంది. అందుకే విభిన్న పాత్రలను చేయాలని నిర్ణయించుకున్నా.

డబ్బింగ్‌ మీరే చెప్పారా?

కృతి: లేదు. ‘ఉప్పెన’లో బేబమ్మకు చెప్పిన ఆర్జే శ్వేతనే దీనికీ చెప్పారు. నేను ప్రయత్నించా కానీ, నా వాయిస్‌ కాస్త నెమ్మదిగా ఉండటంతో ఆమె చెప్పారు. తనది బేస్‌ వాయిస్‌. లుక్‌కి వాయిస్‌కి సరిపోయింది. భవిష్యత్‌లోనూ నా పాత్రలకు ఆమే డబ్బింగ్‌ చెప్పాలని కోరుకుంటున్నా. తన వాయిస్‌ నాకు నప్పుతుంది.

nani shyam singha roy movie
శ్యామ్​సింగరాయ్ సినిమాలో నాని

వాసు, శ్యామ్‌ సింగ రాయ్‌లో ఇందులో ఏది ఇష్టం?

కృతి: వాసు పాత్ర బాగా నచ్చింది. ‘ఎంసీఏ’, ‘నిన్ను కోరి’లో నాని నటనంటే ఇష్టం. ఈ సినిమాలో మైత్రిలో పాత్రలో చేసిన సాయిపల్లవి కూడా బాగా నచ్చింది. డ్యాన్స్‌ చాలా బాగా చేశారు.

మీ డ్రీమ్‌ ప్రాజెక్ట్స్‌ ఏంటి? వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తారా?

కృతి: యాక్షన్‌ సినిమాలంటే ఇష్టం. ఆఫర్స్‌ వస్తే కసరత్తులు ప్రారంభిస్తా. వెబ్‌ సిరీస్‌లకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆఫర్స్‌ రాలేదు. వస్తే తప్పకుండా నటిస్తా.

మొదటి చిత్రంతోనే క్రేజీ ప్రాజెక్ట్స్‌ వస్తున్నాయి. నిర్ణయం తీసుకునేటప్పుడు నో చెబితే ఏమైనా అనుకుంటారా అని భయం ఉందా?

కృతి: ‘ఉప్పెన’ విడుదల కాక ముందే ఆఫర్లు వచ్చాయి. నా మీద నమ్మకం పెట్టుకుని ఆఫర్లు ఇస్తున్నారని ఆనందంగా అనిపించింది. కథ వింటున్నప్పుడు సగటు ప్రేక్షకుడి కోణంలోనే వింటా. నేనూ అమ్మ కలిసే కథ విని ఓకే చేస్తాం. నాకు ఆ పాత్ర సెట్ అవుతుందని అనిపిస్తేనే ఓకే చెబుతాను.

తదుపది చిత్రాల కబుర్లేమిటి?

కృతి: ‘బంగార్రాజు’ షూటింగ్ నిన్ననే పూర్తయింది. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘మాచర్ల నియోజకవర్గం’ త్వరలోనే మీ ముందుకొస్తాయి. రామ్‌తో సినిమా ఇంకా షూటింగ్ జరుగుతోంది. బాలీవుడ్ నుంచి ఇంకా ఆఫర్లు రాలేదు. నాకు మాత్రం ఇక్కడే ఉండాలనిపిస్తోంది.

‘పుష్ప-2’లో స్పెషల్‌ సాంగ్‌, పాత్ర ఉందట నిజమేనా?

కృతి: (నవ్వులు) నేను ఇప్పుడే వింటున్నా. సుకుమార్ గారితో పని చేయడం ఆనందంగా ఉంటుంది. ఆయన్ను చాలా సార్లు కలిశాను. ఆయనతో పనిచేస్తే మంచి అనుభవం వస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.