షకీల అంటే టక్కున గుర్తొచ్చేది వ్యాంప్ పాత్రలు, శృంగార సన్నివేశాలు. అయితే తాను అన్ని రకాల సినిమాలు చేయగలనని నిరూపించుకునేందుకు 'షకీలా రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం'లో నటించింది. అయితే ఇప్పటివరకు ఈమె సినిమాలకు 'ఏ' సర్టిఫికెట్లనే ఎక్కువగా ఇచ్చే సెన్సార్ బోర్డు.. ఈ సినిమాకు మాత్రం 'యూ' సర్టిఫికెట్ ఇచ్చింది.
ఇందులోని ఓ నిమిషం పాటు సాగే డైలాగ్‌ను మాత్రమే మ్యూట్(శబ్దం వినిపించకుండా) చేశారు. ఇతర సన్నివేశాలు యధావిధిగానే ఉంచారు. దీనితో పాటే ఈ సినిమాలో తొమ్మిది పాటలు ఉండటం ప్రత్యేకత. షకీలాతో పాటు విక్రాంత్, పల్లవి ఘోష్ జంటగా నటించారు. సతీష్ వి.ఎన్ దర్శకుడు. సాయిరాం దాసరి దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. సి.హెచ్.వెంకట్‌రెడ్డి సమర్పకులు. ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు వచ్చేది త్వరలో వెల్లడించనున్నారు.
ఇది చూడండి : మల్టీస్టారర్ మలయాళం రీమేక్‌లో రానా-రవితేజ!