ETV Bharat / sitara

'నా 40 ఏళ్ల కెరీర్‌లో అదొక్కటే లోటు' - దర్శకుడు బాల చందర్​

దిగ్గజ దర్శకుడు కె.బాలచందర్​తో కలిసి పనిచేయడం ఇప్పటికీ కలగానే మిగిలిపోయిందని నటి రాధిక విచారం వ్యక్తం చేశారు. చాలాసార్లు చేయాలని అనుకున్నా, కార్యరూపం దాల్చలేదని ఓ నెటిజన్​కు సమాధానమిచ్చారు.

Senior actress Raadhika's biggest regret in her 4 decade old career
నా 40 ఏళ్ల కెరీర్‌లో లోటు అదే: రాధిక
author img

By

Published : May 31, 2020, 9:48 AM IST

ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్‌తో కలిసి పనిచేసే అవకాశం లభించకపోవడం తనకు తీరని లోటు అని సీనియర్‌ నటి రాధిక చెప్పారు. తన 40 ఏళ్ల సినీ కెరీర్‌లో బాధించే విషయం ఇదేనని అన్నారు. ఈ విషయాన్ని ఆమె ట్విటర్‌ వేదికగా తెలిపారు.

"కె. బాలచందర్‌తో తప్ప.. మిగిలిన ప్రముఖ దర్శకులతో కలిసి పనిచేశారు. మీరు ఓ గొప్ప నటి, కానీ ఇది లోటుగా ఉండిపోయినట్లు నాకు అనిపిస్తోంది. ఈ దిగ్గజ డైరెక్టర్ సినిమాకు మిమ్మల్ని సంప్రదించారా? లేదా? ఆయన గురించి చెప్పండి" అని ఓ నెటిజన్‌ అడగ్గా, దానికి రాధిక సమాధానం ఇచ్చారు.

"కొన్నిసార్లు మా మధ్య చర్చలు జరిగాయి. కానీ నేను నటించబోయే సినిమా కథ అద్భుతంగా ఉండాలని ఆయన అనుకున్నారు, దానిపై కొన్నిసార్లు ఆలోచించాం. కానీ దురదృష్టవశాత్తు మా సినిమా ఇప్పటికీ ఖరారు కాలేదు. నన్ను విచారానికి గురిచేసే విషయం ఇది" అని రాధిక పేర్కొన్నారు.

తెలుగులో చివరగా 2017లో 'రాజా ది గ్రేట్‌'లో రాధిక కనిపించారు. ఆపై పలు తమిళ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఐదు చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి... ''కరోనా వైరస్' సినిమా పొరపాటున తీశాను'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.