ETV Bharat / sitara

సీనియర్‌ నటి జయంతికి తీవ్ర అస్వస్థత

ప్రముఖ సీనియర్​ నటి జయంతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్​పై చికిత్స అందిస్తున్నారు. కరోనా నిర్ధరణ పరీక్షలు చేయగా నెగిటివ్​ అని తేలింది.

jayanthi
జయంతి
author img

By

Published : Jul 8, 2020, 7:22 PM IST

Updated : Jul 8, 2020, 9:13 PM IST

ప్రముఖ సీనియర్‌ నటి జయంతి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆమెను బెంగళూరులోని ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్‌ మీద ఉన్నట్లు సమాచారం. శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడటం వల్ల జయంతిని జులై 7 (మంగళవారం) హుటాహుటిన ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 35 ఏళ్లుగా ఆమె ఆస్తమాతో బాధపడుతున్నట్లు సన్నిహితులు తెలిపారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని 24 గంటలపాటు పర్యవేక్షిస్తున్నట్లు వైద్యులు చెప్పారు. కరోనా నిర్ధరణ పరీక్షల్లో నెగిటివ్​ అని తేలిందని వెల్లడించారు.

1945లో బళ్లారిలో జయంతి జన్మించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో దాదాపు 500కిపైగా చిత్రాల్లో నటించారు. తెలుగులో హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. 'పెదరాయుడు'లో రజనీకాంత్‌కు చెల్లెలుగా, మోహన్‌బాబుకు అత్తయ్యగా నటించి మెప్పించారు.

1950వ దశకం నుంచి ఆమె చిత్ర పరిశ్రమలో ఉన్నారు. కర్ణాటక స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డులు, ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటిగా ప్రెసిడెంట్‌ మెడల్‌, రెండు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను ఆమె అందుకున్నారు. కన్నడ చిత్రసీమ 'అభినయ శారద' అనే బిరుదుతో జయంతిని సత్కరించింది.

ఇది చూడండి : 'సుశాంత్​ మృతిపై బాలీవుడ్​ సమాధానం చెప్పాలి!'

Last Updated : Jul 8, 2020, 9:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.