ETV Bharat / sitara

కంగనా సిస్టర్స్​కు మరోసారి సమన్లు - కంగనా సిస్టర్స్​కు సమన్లు

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కంగనా రనౌత్​, ఆమె సోదరికి మరోసారి సమన్లు జారీ చేశారు ముంబయి పోలీసులు. వచ్చే వారంలో వారు విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

Kangana Ranaut,
కంగనా సిస్టర్స్​
author img

By

Published : Nov 3, 2020, 3:37 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి​కి మరోసారి సమన్లు జారీ చేశారు ముంబయిలోని బాంద్రా పోలీసులు. నవంబరు 9,10 తేదీల్లో వారిద్దరు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

అంతకుముందు అక్టోబర్ 26, 27న విచారణకు హాజరుకావాల్సిందిగా కంగనా సిస్టర్స్​కు సమన్లు పంపారు పోలీసులు. అయితే అప్పుడు వారిద్దరు గైర్హాజరయ్యారు. వారి సోదరుడి పెళ్లి సందర్భంగా విచారణకు రాలేకపోయారంటూ కంగన తరఫు న్యాయవాది జమీందర్​ పోలీసులకు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే వారికి మరోసారి సమన్లు పంపారు ముంబయి పోలీసులు.

ఇందుకే సమన్లు

బాలీవుడ్​ ఫిట్​నెస్​ ట్రైనర్​ సయ్యద్​.. కంగనా, ఆమె సోదరి రంగోలి చిత్రపరిశ్రమ పేరును దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని కేసు పెట్టారు. నెపోటిజమ్​, డ్రగ్స్​, మతపరమైన గొడవలు సృష్టించేలా సోషల్​మీడియా వేదికగా మాట్లాడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలోనే ముంబయి పోలుసులు కంగనా సిస్టర్స్​పై కేసు నమోదు చేసి వారిని విచారణకు పిలిచారు.

ఇదీ చూడండి 'సొంతూరిలో షూటింగ్.. అయినా ఇంటికి దూరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.