ETV Bharat / sitara

Samantha: 'అక్కినేని' పేరు తొలగింపుపై స్పందించిన సమంత - సమంత అక్కినేని నెక్ట్స్ సినిమా

తన సోషల్​మీడియా అకౌంట్లలో అక్కినేని పేరును తొలిగించి అభిమానులను ఆశ్చర్యపరచిన హీరోయిన్​ సమంత ఆ అంశంపై తొలిసారి స్పందించింది. అనవసర విషయాలపై వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పింది.

సమంత
సమంత
author img

By

Published : Aug 25, 2021, 4:10 PM IST

సామాజిక మధ్యమాల్లో యాక్టివ్​గా ఉండే సమంత.. తన సోషల్​మీడియా అకౌంట్లలో అక్కినేని పేరును తొలగించింది. అనంతరం ఇది చర్చనీయాశమైంది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్​లో ఉత్తమ నటి అవార్డు అందుకున్న సందర్భంగా అక్కినేని పేరు మార్పుపై సమంతను ప్రశ్నించగా.. ఆమె స్పందించేందుకు నిరాకరించారు.

"అనవసర కామెంట్లపై నేను స్పందించను. వాస్తవానికి 'ఫ్యామిలీ మ్యాన్‌' వెబ్​సిరీస్​పైనా ట్రోల్స్ వచ్చాయి. వీటన్నింటిపై మాట్లాడే ఉద్దేశం లేదు. ఎవరికీ ఎలాంటి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు."

-సమంత

ఫ్యామిలీ మ్యాన్ వివాదంపై సమంత స్పందించింది. 'నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ నేనేదో చెప్పాలని కోరుకుంటున్నారు. అయితే.. అనవసర విషయాలపై మాట్లాడే అవసరం నాకు లేదు' అని సమంత తెలిపింది.

వైవిధ్యమైన పాత్రలతో అగ్ర హీరోయిన్​గా పేరుతెచ్చుకున్న నటి సమంత. నటనలోనే కాకుండా.. వ్యాపారవేత్తగానూ రాణిస్తోంది. అక్కినేని పేరు తొలగింపుతో సమంత వైవాహిక జీవితంపై అనేక ఊహాగానాలు వెలువడ్డాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.